Home గాసిప్స్ బాలయ్యతో అనుకుంటే..రవితేజ వచ్చాడు…సాలిడ్ కాంబినేషన్ ఇది!!

బాలయ్యతో అనుకుంటే..రవితేజ వచ్చాడు…సాలిడ్ కాంబినేషన్ ఇది!!

2160
0

మలయాళం లో సూపర్ హిట్ అయిన లేటెస్ట్ మూవీ అయ్యప్పనుం కోశియుం సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరగగా… బిజు మీనన్ రోల్ కి ముఖ్యంగా నట సింహం బాలయ్య ని తీసుకోవాలని తనకి అయితే ఆ రోల్ అద్బుతంగా సెట్ అవుతుందని తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్న సితారా ఎంటర్ టైన్ మెంట్ వారు చాలా ప్రయత్నాలు చేశారు కానీ బాలయ్య రీమేక్ కి నో చెప్పాడు.

దాంతో ఇప్పుడు బాలయ్య లా మాస్ రోల్స్ లో కుమ్మేసే నటుడిని తీసుకున్నారు నిర్మాతలు, రఫ్ అండ్ టఫ్ రోల్స్ లో కుమ్మేసే మాస్ మహారాజ్ రవితేజ ని ఈ రోల్ కి ఒప్పించగా పృద్వీరాజ్ రోల్ కి మాత్రం రానా దగ్గుబాటి ని తీసుకున్న విషయం తెలిసిందే.

మొత్తం మీద ఒరిజినల్ ని మరిపించే విధంగా తెలుగు రీమేక్ స్టార్ కాస్ట్ సెట్ అవ్వగా తమిళ్ లో కూడా స్టార్ బ్రదర్స్ సూర్య మరియు కార్తీలు నటిస్తారని అంటున్నారు, ఇక హిందీ లో కూడా రీమేక్ కాబోతుంది ఈ సినిమా. ఇక తెలుగు రీమేక్ విషయానికి వస్తే…

లెంత్ కొద్దిగా తగ్గించి మాస్ ఎలిమెంట్స్ కొంచం ఎక్కువగా జోడిస్తే సినిమా రేంజ్ మరో లెవల్ కి వెళ్ళడం ఖాయమని చెప్పొచ్చు. ఇక తెలుగు వర్షన్ ని రీమేక్ చేసే డైరెక్టర్ ఎవరనే చర్చలు జరుగుతుండగా ఇద్దరు డైరెక్టర్స్ పేర్లు ఇక్కడ వినిపిస్తున్నాయి. అందులో ఒకరు బి గోపాల్ కాగా మరొకరు సుధీర్ వర్మ అని అంటున్నారు.

మాస్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు అదరగొట్టిన బి గోపాల్ కంబ్యాక్ కోసం చూస్తున్నాడు, ప్రజెంట్ స్టైలిష్ టేకింగ్ తో ఆకట్టుకునే సుధీర్ వర్మ కూడా ఇప్పుడు కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు, మరి ఇద్దరి లో ఎవరు ఫైనల్ అవుతారో త్వరలో తేలనుంది… ఇక సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here