మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర రాజా ది గ్రేట్ తర్వాత వరుస పెట్టి ఫ్లాఫులు ఒకటి తర్వాత ఒకటి ఎదురుకుంటూ రాగా టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంథోని మరియు డిస్కో రాజా అంటూ ఒకటికి మించి ఒకటి 4 డిసాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది, ఏకంగా 4 డిసాస్టర్ మూవీస్ తర్వాత ఈ ఇయర్ ఎట్టకేలకు క్రాక్ సినిమా తో రవితేజ…
బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు, సినిమా ఊహకందని బ్లాక్ బస్టర్ విజయాన్ని 50% లిమిటేషన్స్ ఉన్నా కానీ సొంతం చేసుకుని రవితేజ కి తిరుగులేని కంబ్యాక్ మూవీ గా నిలిచి సత్తా చాటుకుంది. ఇలాంటి టైం లో రవితేజ చేస్తున్న కొత్త సినిమా ఖిలాడీ…
ఈ సినిమా పై కూడా ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి. సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మరింతగా ఆలస్యం కాబోతుండగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం అల్టిమేట్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది, రవితేజ కెరీర్ లోనే అత్యధిక రేటు…
ఈ సినిమా కోసం రీసెంట్ గా లీడింగ్ OTT వాళ్ళు ఇచ్చారని సమాచారం. ఏకంగా 42 కోట్ల భారీ రికార్డ్ రేటు ని డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఇస్తామని చెప్పుకోచ్చారట. బాక్స్ ఆఫీస్ బిజినెస్ రేంజ్ ని కూడా మించిన బిజినెస్ ఆఫర్ ఇదని చెప్పొచ్చు. అయినా కానీ టీం సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కన్ఫాం చేశారు. సినిమా ను రూపొందించింది ఆడియన్స్ ముందుకు…
థియేటర్స్ లోనే తీసుకు రావడానికే అని, ఖిలాడీ సినిమా ను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామంటూ నిర్మాత కన్ఫాం చేశారు, కానీ ఈ రేంజ్ రేటు ని కూడా వద్దూ అంటున్నారు అంటే సినిమా పై యూనిక్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు ఈ అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాక దుమ్ము లేపుతుందో చూడాలి.