మాస్ మహారాజ్ రవితేజ బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఆడియన్స్ లో మంచి హైప్ ని పెంచేలా చేసిన సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రస్తుతం క్రేజ్ సాలిడ్ గా ఉంది. రవితేజ నుండి సాలిడ్ కంబ్యాక్ ఈ సినిమా తో వస్తుంది అన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సాలిడ్ రెస్పాన్స్ ను కూడా సొంతం చేసుకోవడంతో…
మరింత క్రేజ్ ను పెంచుకున్న సినిమా ఇప్పుడు భారీ లెవల్ లో ఈ నెల 9 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అనుకున్నప్పుడు బిజినెస్ 18 కోట్ల రేంజ్ లో జరగగా…
ఇప్పుడున్న పరిస్థితుల నేపధ్యంలో బిజినెస్ తగ్గింది అయినా కానీ మొత్తం మీద నైజాంలో 4.2 కోట్ల బిజినెస్ ను, సీడెడ్ లో 2.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రా లో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో…
మొత్తం మీద సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల ఓన్ రిలీజ్ సొంతం అవ్వనుంది కాబట్టి ఆ బిజినెస్ ని ఇంక్లూడ్ చేయలేదు. మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో నిలుస్తుంది.
సినిమా కి ఉన్న క్రేజ్ దృశ్యా ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. రవితేజ గోపీచంద్ మలినేని ల కాంబో లో ఇది వరకు వచ్చిన డాన్ శీను మరియు బలుపు రెండూ మంచి విజయాలను నమోదు చేయడం తో ఇప్పుడు క్రాక్ కూడా విజయం సొంతం చేసుకుని హాట్రిక్ ని కంప్లీట్ చేసుకుంటుంది అని అంతా ఆశిస్తున్నారు.