మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో 9న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా… మొత్తం మీద లెంత్…
2 గంటల 34 నిమిషాల లెంత్ తో వస్తున్న ఈ సినిమా సెన్సార్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది. అది ఎంతవరకు నిజం అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది కానీ, కథ పాయింట్ పరంగా ఆల్ రెడీ ట్రైలర్ లో చూపెట్టిన కథ కొంచం మాత్రమేనని….
ఒక సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ కి ఒక కేసు దృశ్యా ఎదురుదయినా అనుభవాలే క్రాక్ సినిమా అని అంటున్నారు. కథ పాయింట్ కొంచం రెగ్యులర్ గానే ఉన్నప్పటికీ కూడా పక్కా గోపీచంద్ మలినేని స్టైల్ లో కమర్షియల్ హంగులతో మాస్ ఎలిమెంట్స్ తో హీరోయిజం ఎలివేషన్ సీన్స్ తో…
సినిమా ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందని అంటున్నారు. రవితేజ పవర్ ఫుల్ రోల్ అండ్ పెర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు. సింపుల్ గా సెన్సార్ నుండి సినిమా కి వస్తున్న టాక్ ఎబో యావరేజ్ రేంజ్ లో కథ ఉంటుంది కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉన్నప్పటికీ మాస్ ని బాగా మెప్పించే అంశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే…
రీసెంట్ రవితేజ మూవీస్ లో పవర్ బెంగాల్ టైగర్ రేంజ్ కి మించే ఈ సినిమా ఉంటుంది అంటూ స్ట్రాంగ్ టాక్ ఒకటి బయటికి వచ్చింది. ఇది కనుక ఇప్పుడు నిజం అయితే స్టొరీ పాయింట్ సింపుల్ గా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ మాత్రం ఖాయమని చెప్పొచ్చు. మరి వీటిలో ఎంత నిజం ఉందో రిలీజ్ రోజున తేలనుంది…