మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా టైం అవుతుంది, బెంగాల్ టైగర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రాజా ది గ్రేట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ తర్వాత వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుని చేసినా కానీ ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది, చేసిన సినిమా చేసినట్లు భారీ ఫ్లాఫ్ గానే మిగిలి పోయినా కానీ రవితేజ క్రేజ్ పవర్ మాత్రం తగ్గలేదు.
రవితేజ కొత్త సినిమాలు అన్నీ కూడా మంచి బడ్జెట్ తో తెరకెక్కగా వాటి కి ఓవరాల్ బిజినెస్ కూడా సాలిడ్ గానే జరిగింది, రీసెంట్ గా రవితేజ కంబ్యాక్ మూవీ అవుతుంది అన్న నమ్మకంగా ఉన్న క్రాక్ సినిమా ఎప్పుడో సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ…
కరోనా వలన వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ ను సంక్రాంతి కి కన్ఫాం చేసుకుంది. దాంతో సినిమా బిజినెస్ మెల్లి మెల్లిగా జోరు అందుకుంటూ ఉండగా రీసెంట్ గా సినిమా హిందీ డబ్బిన్ రైట్స్ కింద సాలిడ్ రేటు సొంతం అయినట్లు సమాచారం అందుతుంది.
హిందీ శాటిలైట్ రైట్స్ కింద రవితేజ సినిమాలకు మంచి క్రేజ్ ముందు నుండే ఉందా హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా అన్ని సినిమాలకు బిజినెస్ బాగా జరుగుతూ వస్తుంది, ఇప్పుడు క్రాక్ సినిమా కి కూడా అక్కడ 12 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇది నిజంగానే సాలిడ్ రేటు అనే చెప్పాలి. సినిమా బడ్జెట్ లాక్ డౌన్ వలన పెరగడం తో…
అన్ని కలిపి ఎంతవరకు రికవరీ అవుతుంది అన్నది కొంచం డౌట్ ఉన్నా ఇప్పుడు హిందీ రైట్స్ తోనే 12 కోట్లు రికవరీ అవ్వడంతో తెలుగు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అండ్ థియేట్రికల్ రైట్స్ తో సినిమా బడ్జెట్ రికవరీ అవ్వడం పక్కా. ఇక సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ కూడా కంబ్యాక్ ఇస్తే మరింత రచ్చ జరగడం ఖాయమని చెప్పొచ్చు.