మాస్ మహారాజ్ రవితేజ బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఎక్కువ హోప్స్ పెంచుకున్న సినిమా క్రాక్, ఫ్యాన్స్ కూడా ఈ సినిమా తో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడు అన్న నమ్మకంతో ఉండగా సినిమా డిజిటల్ రిలీజ్ చేస్తారు అన్న టాక్ వచ్చినా తర్వాత అవి రూమర్స్ గానే మిగిలిపోగా సినిమా సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కానుందని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు.
ఇక ఈ మధ్యే సినిమాలో మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేయగా ఇక మిగిలిన పనుల సన్నాహంలో ఉన్న టైం లో ఇప్పుడు సినిమా పై ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. సినిమా నిర్మాత అయిన ఠాగూర్ మధు ఇది వరకు నిర్మించిన సినిమా వలన…
ఇప్పుడు క్రాక్ సినిమా ఇబ్బందుల్లో పడినట్లు అయింది. ఏడాదిన్నర క్రితం ఠాగూర్ మధు నిర్మించిన విశాల్ అయోగ్య సినిమా బిజినెస్ లో భాగంగా బయ్యర్లకి మినిమం గ్యారెంటీ పద్దతిలో డబ్బు తీసుకుని సినిమాను అమ్మగా సినిమా నష్టాలను గట్టిగానే మిగిలించిన విషయం తెలిసిందే.
దాంతో అప్పటి నుండి తమ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఒక భారీ డిస్ట్రిబ్యూటర్… ఎదురు చూసి చూసి ఇప్పుడు ఆ డబ్బులు క్లియర్ చేస్తేనే క్రాక్ సినిమా ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది అని కోర్టులో స్టే పిటిషన్ ని వేశారని సమాచారం. దాంతో ఇప్పుడు కోర్టు నిర్ణయం ఆ డిస్ట్రిబ్యూటర్ కి అనుకూలంగా వచ్చే అవకాశం ఉండటంతో…
రవితేజ క్రాక్ రిలీజ్ పై ఇది ఎఫెక్ట్ చూపే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఒకవేళ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ఆ డబ్బును నిర్మాత చెల్లించాల్సి ఉంటుంది, ఎంత అనేది క్లియర్ గా చెప్పుకున్నా 5 కోట్లకి పైగానే రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.