షాక్: రవితేజ సినిమా ఆగిపోయిందట!!

0
472

  మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు, వరుసగా కొన్ని ఫ్లాఫులు ఎదురు అయిన సమయం లో రాజా ది గ్రేట్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ తర్వాత మళ్ళీ ఒకటి కి మించి ఒకటి 3 ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు, ఇలాంటి సమయం లో ఎక్కడి కి పోతావు చిన్నవాడ లాంటి సైంటిఫిక్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో సరికొత్త సినిమా “డిస్కో రాజా” ని ఓకే చేశాడు రవితేజ.

కాగా ఈ సినిమా షూటింగ్ కొంతవరకు జరగగా తర్వాత సినిమా గురించిన ఎలాంటి వార్తలు బయటికి రాలేదు, కాగా ఇప్పుడు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఆగిపోయింది అని అంటున్నారు, దానికి రీజన్ రవితేజ రెమ్యునరేషన్ విషయం లో కొన్ని ఇబ్బందులు రావడంతో…

సినిమా షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు, ఫ్లాఫ్స్ పడ్డా రెమ్యూనరేషన్ పరంగా రవితేజ తగ్గను అని చెబుతుండటం తో బడ్జెట్ ప్రాబ్లమ్స్ వలన సినిమా కొంత కాలం వరకు ఆగిందని, అన్నీ సద్దుకుంటే తిరిగి షూటింగ్ జరుపుకుంటుంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here