మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ కొట్టిన టైం లో కొత్త సినిమా ఏది కమిట్ అవ్వాలా అని ఎదురు చూస్తున్న టైం లో ఒక తమిళ్ సినిమా రవితేజ కి బాగా నచ్చింది, తెలుగు లో ఈ సినిమా రిలీజ్ చేస్తే బాగుటుంది అనుకున్నాడు. ఒరిజినల్ వర్షన్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నే తెలుగు వర్షన్ కి డైరెక్టర్ గా అనుకున్నారు.
కొన్ని నెలల పాటు తెలుగు లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు కానీ ఆ మార్పులు చేర్పులు రవితేజ కి నచ్చలేదు. దాంతో ఒరిజినల్ ని అలానే చేద్దాం అనుకున్నారు కానీ తర్వాత ఏమైందో తెలియదు సడెన్ గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
ఆ సినిమా డైరెక్టర్ తెలుగు లో మరెవరితో కూడా ఆ సినిమా చేయకుండా అలానే వదిలివేయగా మూడేళ్ళు పూర్తీ అయిన తర్వాత ఇప్పుడు సినిమా తెలుగు లో డబ్ అయ్యి డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని సమాచారం… ఆ సినిమా నే జయం రవి అరవింద్ సామి ల కాంబినేషన్ లో…
తనీ ఒరువన్ తర్వాత తెరకెక్కిన భోగన్ సినిమా… ఈ సినిమా తమిళ్ లో మొత్తం మీద 25 కోట్ల మేర కలెక్షన్స్ ని అందుకుని మంచి రిజల్ట్ నే సొంతం చేసుకుంది, కానీ తెలుగు లో రీమేక్ అనుకోకుండా ఆగిపోగా… దాదాపు 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాను తెలుగు లో డబ్ చేస్తున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు.
దాంతో అందరూ ఇది రవితేజ చేయాల్సిన సినిమా అంటూ గుర్తు చేసుకుంటున్నారు. రాజా ది గ్రేట్ టైం తర్వాత టచ్ చేసి చూడు అప్పటికే కొంత చేసి ఉండగా నేల టికెట్ ప్లేస్ లో ఈ సినిమా రీమేక్ చేయాల్సింది. కానీ ఈ సినిమాను వద్దు అనుకుని నేల టికెట్ చేయగా ఆ సినిమా ఫ్లాఫ్ అయింది. రవితేజ ఈ సినిమా చేసి ఉన్నా మంచి రిజల్ట్ వచ్చి ఉండేదేమో అని అందరూ అనుకుంటున్నారు.