Home న్యూస్ రావణాసుర టీసర్ రివ్యూ…రవితేజ మాస్ విలనిజం!!

రావణాసుర టీసర్ రివ్యూ…రవితేజ మాస్ విలనిజం!!

0

మాస్ మహారాజ్ రవితేజ బాక్ టు బాక్ సక్సెస్ లతో మంచి జోరు మీదున్నాడు. వరుస ఫ్లాఫ్స్ తర్వాత ధమాకా సినిమాతో సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్న రవితేజ ఆ సినిమా తర్వాత మెగాస్టార్ వాల్తేరు వీరయ్యలో చేసిన స్పెషల్ రోల్ తో మరింత రీచ్ ను దక్కించుకుని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మరో ఎక్స్ పెరి మెంటల్ మూవీ తో రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ సినిమానే రావణాసుర….

మంచి క్వాలిటీ మూవీస్ తీస్తాడు అన్న పేరున్న సుధీర్ వర్మ డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కూడా నటిస్తూ ఉండగా సినిమా టీసర్ కట్ చూస్తూ ఉంటే రవితేజ విలనీష్ టచ్ ఎక్కువగా కనిపించింది అని చెప్పాలి… టేకింగ్ మరోసారి ఆకట్టుకోగా….

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ ‘సీతని తీసుకెళ్ళాలి అంటే సముద్రం దాటితే సరిపోదు…ఈ రావణాసురుడిని కూడా దాటాలి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ తో సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అన్నది కొంచం హింట్ ఇచ్చారు అనిపిస్తుంది అని చెప్పాలి.

రవితేజ ఎప్పటి లానే ఎనర్జీతో పాటు ఫస్ట్ టైం మాస్ విలనిజం టచ్ ఉన్న రోల్ చేస్తూ ఉండగా మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా టీసర్ లో చూపించలేదు. ఓవరాల్ గా టీసర్ సినిమా పై క్యూరియాసిటీని అయితే పెంచింది అని చెప్పాలి. ఇక ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here