Home గాసిప్స్ రవితేజ – విజయ్ సేతుపతి…బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్..!!

రవితేజ – విజయ్ సేతుపతి…బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్..!!

1897
0

 

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా క్రాక్ మూవీ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చాడు, 50% ఆక్యుపెన్సీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసిన రవితేజ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. ఇక కోలివుడ్ నాచురల్ యాక్టర్ విజయ్ సేతుపతి తెలుగు లో విలన్ గా చేసిన ఉప్పెన సినిమా..

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలవగా తెలుగు లో విజయ్ సేతుపతి కి మరింత భారీ పాపులారిటీ దక్కింది అని చెప్పాలి. దాంతో విజయ్ కి తెలుగు లో మరిన్ని అవకాశాలు వెల్లువగా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ కి సంభందించిన ఓ వార్తా టాలీవుడ్ లో..

గట్టిగా చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా ఏకంగా రవితేజ విజయ్ సేతుపతి ల కాంబినేషన్ లోనే సరికొత్త మల్టీ స్టారర్ మూవీ రూపొందబోతుంది అంటూ వార్తలు శిఖారు చేస్తున్నాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కి తెలుగు తమిళ్ బైలింగువల్ రీమేక్ అని అంటున్నారు.

మలయాళం లో 2019 లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసన్స్ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయాలని రామ్ చరణ్ ట్రై చేశారు కానీ సెట్ కాలేదు, కానీ ఆ రీమేక్ ను ఇప్పుడు రవితేజ విజయ్ సేతుపతిలతో సెట్ చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీని పై ఇంకా ఎవరూ కూడా ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు కానీ సడెన్ గా..

నిజం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పొచ్చు. డ్రైవింగ్ లైసన్స్ సినిమాలో ఇద్దరు హీరోలకు సమానమైన ఇంపార్టంట్స్ ఉంటుంది, తాను అభిమానించే హీరోనే తనకి తనకి డ్రైవింగ్ లైసన్స్ దృశ్యా గొడవ అయితే పరిస్థితులు ఎలా మారిపోయాయి అన్నది సినిమా కథ పాయింట్… సింపుల్ గా ఉన్నప్పటికీ మంచి హిట్ అవ్వడం తో ఈ సినిమా రీమేక్ ఎంతవరకు అఫీషియల్ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here