Home న్యూస్ రవితేజ రీసెంట్ మూవీస్ డే 1 వసూళ్లు….మాస్ రాజా జోరు పెంచాల్సిందే రాజా!!

రవితేజ రీసెంట్ మూవీస్ డే 1 వసూళ్లు….మాస్ రాజా జోరు పెంచాల్సిందే రాజా!!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన రీసెంట్ మూవీస్ లో క్రాక్ మరియు ధమాకా సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలు ఏవి కూడా పెద్దగా జోరు చూపించ లేక పోయాయి. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) మొదటి ఆటకే ఎక్స్ ట్రీం లెవల్ లో మిక్సుడ్ టాక్ ను…

ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని ఇక తేరుకునేలా అయితే కనిపించడం లేదు…సోషల్ మీడియా మొత్తం సినిమా మీద ట్రోల్స్ కనిపిస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ కలిపి కూడా సినిమా ఆశించిన రేంజ్ లో జోరు చూపించలేదు…

మొత్తం మీద మొదటి రోజు 4.56 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ప్రీమియర్స్ కలెక్షన్స్ ని తీస్తే షేర్ చాలా లిమిటెడ్ గానే వచ్చింది. రీసెంట్ టైంలో రవితేజ నటించిన సినిమాలు అన్నీ కూడా 4 కోట్లకి అటూ ఇటూగానే ఓపెనింగ్స్ ను అందుకున్నాయి.

Mr Bachchan Movie 1st Day Total WW Collections!!

ఒకసారి రవితేజ రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
#Raviteja Recent Movies 1st Day AP TG Collections
👉#MrBachchan – 4.56CR******
👉#Eagle – 3.93CR
👉#TigerNageswaraRao – 4.33CR
👉#Ravanasura – 4.29CR
👉#DHAMAKA – 4.66CR
👉#RamaraoOnDuty – 2.82Cr
👉#Khiladi – 4.30cr
👉#krack – 6.25Cr
👉#DiscoRaja – 2.54Cr

మిగిలిన హీరోలు సినిమా సినిమాకి తమ రేంజ్ ని పెంచుకుంటూ ఉండగా ఒకప్పుడు టాప్ స్టార్స్ రేంజ్ లో జోరు చూపించిన రవితేజ రీసెంట్ టైంలో వరుస పెట్టి బిలో పార్ కలెక్షన్స్ నే అందుకుంటూ ఉన్నాడు…సినిమాల ఎంపిక విషయంలో ఒకప్పుడు రవితేజ ఛాయిస్ లు…

అద్బుతంగా ఉండగా రీసెంట్ టైంలో నాసిరకం మూవీస్ ని ఎంచుకుంటూ ఉండగా వాటి రిజల్ట్ ల వలన ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ పడుతూ ఉండగా అప్ కమింగ్ మూవీస్ విషయంలో రవితేజ కచ్చితంగా శ్రద్ధ చూపించి నికార్సయిన బ్లాక్ బస్టర్స్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here