రంగస్థలంతో చరిత్రకేక్కే రికార్డులు సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఈ సారి ఎలాంటి కథతో వస్తాడా అని అందరు ఎదురు చూస్తుండగా ఈ సినిమా మెయిన్ స్టొరీలైన్ ఇదే అంటూ ఒక లైన్ ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొడుతుంది.
ఆ లైన్ ప్రకారం సినిమా కథ ఆల్ మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి “గ్యాంగ్ లీడర్” ని పోలి ఉంటుంది అని అంటున్నారు. అందులో చిరుకి ఇద్దరు అన్నలు కాగా ఒకరిని విలన్స్ చంపేస్తారు. అది హీరోకి ఫ్యామిలీ చెప్పదు…చివర్లో తెలుస్తుంది. ఇక్కడ రామ్ చరణ్ సినిమాలో….
నలుగురు అన్నలు ఉంటారట….అందులో ఒకరిని విలన్స్ చంపడం ఆ విషయం హీరో కి తెలియకుండా ఫ్యామిలీ జాగ్రత్త పడటం…అది తెలుసుకున్న హీరో ఎం చేశాడు అన్నది సినిమా కథ అని అంటున్నారు. స్టొరీ పాయింట్ ఇంటరెస్టింగ్ గా ఉండటం…బోయపాటి మాస్ సీన్స్ తో ఓ రేంజ్ లో రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.