Home న్యూస్ ఇది కదా పోస్టర్ అంటే….RC16 ఫస్ట్ లుక్ అరాచకం అంతే!!

ఇది కదా పోస్టర్ అంటే….RC16 ఫస్ట్ లుక్ అరాచకం అంతే!!

0

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత చేసిన గేమ్ చేంజర్ మూవీతో అంచనాలను అందుకోలేక పోయాడు….ఎప్పటి నుండో డిలే అవుతూ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడియన్స్ ను మెప్పించలేక భారీ లెవల్ లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

అలాంటి రిజల్ట్ తర్వాత ఆడియన్స్ ను ఫ్యాన్స్ ను మెప్పించడమే పనిగా పెట్టుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ తో కలిసి చేస్తున్న RC16 మూవీని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతూ ఉండగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ను అలాగే..

టైటిల్ ను ఇప్పుడు కన్ఫాం చేశారు…..రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా సినిమా అఫీషియల్ టైటిల్ ను కన్ఫాం చేయగా టైటిల్ అండ్ రామ్ చరణ్ న్యూ లుక్ ఓ రేంజ్ లో మెప్పించేలా ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు….RC16 ను అఫీషియల్ గా ఇప్పుడు పెద్ది(Peddi Movie)…

టైటిల్ ను కన్ఫాం చేశారు. ఇక రామ్ చరణ్ లుక్ కంప్లీట్ గా రగ్గుడ్ లుక్ తో రంగస్థలంని కూడా మించి పోయే రేంజ్ మాస్ టచ్ తో ఉండగా…ఒక లుక్ లో బీడీ వెలిగిస్తూ రామ్ చరణ్ లుక్ ఓ రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి. జస్ట్ ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద అంచనాలు…

ఓ రేంజ్ లో పెరిగిపోగా…ఫ్యాన్స్ అందరూ ఇది కదా పోస్టర్ అంటే అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ ఉండటం విశేషం….రంగస్థలంని మించిన రగ్గుడ్ రోల్ లో పెద్దిలో నటించబోతున్న రామ్ చరణ్ ఈ సినిమాతో అసలు సిసలు బాక్స్ ఆఫీస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here