Home న్యూస్ రెడ్, అల్లుడు అదుర్స్ 4th డే, మాస్టర్ 5th డే, క్రాక్ 8th డే కలెక్షన్స్...

రెడ్, అల్లుడు అదుర్స్ 4th డే, మాస్టర్ 5th డే, క్రాక్ 8th డే కలెక్షన్స్ రిపోర్ట్!

1684
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు అన్ని కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి. ఇక అన్ని సినిమాలకు చివరి బిగ్ డే గా ఆదివారం నిలుస్తుంది అని చెప్పాలి. సోమవారం నుండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని సినిమాలకు డ్రాప్స్ ఉంటాయి. ఇక ఈ సినిమాలు చివరి బిగ్ డే లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయో చూద్దాం.

మొదటగా రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ రెడ్ మూవీ మరోసారి స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని స్టడీగా ఉందని చెప్పాలి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు మరోసారి 2 కోట్ల వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉంది… 2 కోట్లను మించితే అది ఊచకోత అనే చెప్పాలి.

ఇక మరో సంక్రాంతి మూవీ అల్లుడు అదుర్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు మరోసారి డీసెంట్ గానే ఉంది కాని బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇది సరిపోదు. కానీ మరోసారి డీసెంట్ షేర్స్ ని సాధిస్తున్న సినిమా 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఇక సంక్రాంతి సూపర్ హిట్ క్రాక్ సినిమా మొదటి వారాన్ని ఘనంగా ముగించుకుని దుమ్ము లేపుతుండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు మరోసారి స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. సినిమా కి థియేటర్స్ నాసిరకం వి ఇవ్వడం తో కలెక్షన్స్ తగ్గుతున్నాయి. అయినా కానీ ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

ఇక విజయ్ మాస్టర్ సినిమా మరోసారి స్ట్రాంగ్ గా దూసుకు పోతుంది, వైజాగ్ సీడెడ్, నైజాం లో సినిమా అద్బుతంగా హోల్డ్ చేసింది. దాంతో మరో కోటికి తగ్గని షేర్ కన్ఫాం అనే చెప్పాలి, ఫైనల్ లెక్క 1.2 కోట్ల రేంజ్ లో కూడా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here