Home న్యూస్ రెడ్-అల్లుడు అదుర్స్ ఫస్ట్ డే, క్రాక్ 5th డే, మాస్టర్ డే 2 కలెక్షన్స్!

రెడ్-అల్లుడు అదుర్స్ ఫస్ట్ డే, క్రాక్ 5th డే, మాస్టర్ డే 2 కలెక్షన్స్!

3825
0

బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 14 సంక్రాంతి హాలిడే అవ్వడం తో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ సెలవు అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో వాడుకుని ఎంజాయ్ చేస్తున్నాయి. పండగ టైం లో రిలీజ్ అయిన అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంది, ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించవచ్చో వివరాలను తెలుసుకుందాం పదండీ…

ముందుగా కొత్తగా రిలీజ్ అయిన సినిమాల్లో రామ్ నటించిన రెడ్ ఎక్కువ థియేటర్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ కూడా బాగా సొంతం చేసుకుంది. మార్నింగ్ మ్యాట్నీ షోలను మించి ఈవినింగ్ నైట్ షోలకు సినిమా సాలిడ్ ట్రెండ్ ని కొనసాగించి మొదటి రోజు ఇప్పుడు 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమా టాక్ అన్ని సినిమాల కన్నా కూడా వీక్ గా ఉండగా సినిమా ఓపెనింగ్స్ మాత్రం పర్వాలేదు అనిపించుకుంటుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొదటి రోజు 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆ లెక్క 1.5 కోట్ల దాకా కూడా వెళ్ళొచ్చు.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ రిలీజ్ అయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతున్న రవితేజ క్రాక్ సినిమా 5 వ రోజు కూడా మళ్ళీ దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేయగా సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర పోటి లో కూడా మంచి వసూళ్ళని సొంతం చేసుకోబోతుంది. మినిమమ్ 2 కోట్ల రేంజ్ కి తగ్గని షేర్ ని సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక రేసులో ఉన్న డబ్బింగ్ మూవీ మాస్టర్ మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెంటల్ మాస్ అనిపించుకోగా సినిమా రెండో రోజు కూడా మళ్ళీ సాలిడ్ గానే హోల్డ్ చేసింది. బుకింగ్స్ బాగుండటంతో సినిమా రెండో రోజు 2 కోట్ల వరకు షేర్ ని అందుకోవచ్చు. మరి అఫీషియల్ గా ఈ సినిమాలు ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here