ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ ది ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది, ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ ని పూర్తీగా రివీల్ చేయకున్నా కానీ ఒక మర్డర్ మిస్టరీలో ముందు ఒకరిని అనుకుని జైలుకి తెచ్చిన తర్వాత సడెన్ గా తనలానే మరొకరు ఉండటంతో ఆ ఇద్దరిలో మర్డర్ ఎవరు చేశారో కనిపెట్టే క్రైం థ్రిల్లర్ మూవీ నే రెడ్ అని అంటున్నారు.
2 రోల్స్ లో రామ్ అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపెశాడని అంటున్నారు, మాస్ రోల్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అనిపించే లెవల్ లో ఉందని అంటున్నారు. ఇక హీరోయిన్స్ ముగ్గురు ఉన్నంతలో తమ తమ రోల్స్ లో మెప్పించారని చెబుతున్నారు.
సినిమా రీమేక్ అయినా ఒరిజినల్ ని సీన్ టు సీన్ తీయకుండా కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేశారని, అవి బాగున్నాయని అంటున్నారు. సినిమా లెంత్ కొంచం పెద్దగా అనిపించడం అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలు కొంచం తక్కువ ఉండటం సినిమాలో మేజర్ డ్రా బ్యాక్స్ అని కానీ, అవి పట్టించుకోకుండా సినిమా కి వస్తే మట్టుకు సినిమా కచ్చితంగా అలరించే సత్తా ఉన్న సినిమా అని…
అంటున్నారు… ఇక సినిమా లో పాటలు అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుండగా ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ లు ఒరిజినల్ చూడని వాళ్లకి మంచి థ్రిల్ ఇస్తాయని అంటున్నారు. మొత్తం మీద సినిమా సింపుల్ గా ఎలా ఉంది అంటే మాత్రం హిట్ కి ఏమాత్రం తగ్గని…
రేంజ్ లో మెప్పించింది రెడ్ మూవీ అని అంటున్నారు. రామ్ కి ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో విజయం పడే అవకాశం పక్క అని అంటున్నా రీమేక్ అవ్వడం తో ఒరిజినల్ ని చూడని వాళ్ళకి ఎక్కువ నచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అదే సమయం లో ఆల్ రెడీ చూసిన వాళ్లకి మాత్రం…
ట్విస్ట్ లు అన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్లకి ఎబో యావరేజ్ రేంజ్ లో సినిమా అనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ నుండి హిట్ రేంజ్ లో రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక కామన్ ఆడియన్స్ నుండి సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి ఇక…