Home న్యూస్ రిపబ్లిక్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

రిపబ్లిక్ మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ హిట్స్ కొట్టిన సాయి ధరం తేజ్ ఇప్పుడు దేవకట్టాతో కలిసి చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ గా డిఫెరెంట్ జానర్ మూవీ అవ్వడం తో సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. మరి సినిమా ఎలా ఉందో ఎంతవరకు ఆకట్టుకుందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…

   

ముందుగా కథ పాయింట్ కి వస్తే… తన ఓటుని రిగ్గింగ్ చేశారని గొడవ పడే హీరో తర్వాత విదేశాలకు పై చదువుల కోసం వెళ్ళాల్సి ఉన్నా కాన్సిల్ చేసుకుని IAS కి ప్రిపేర్ అయ్యి వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ అవుతాడు…ఇక రాజకీయ పార్టీ హెడ్ అయిన రమ్యక్ర్రిష్ణ కి హీరో…

ప్రతీ విషయంలో అడ్డు వస్తాడు… మరి వీళ్ళ పోటి లో ఎవరిదీ పైచేయి అయ్యింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓవరాల్ గా స్టొరీ పాయింట్ బాగుంది, పెర్ఫార్మెన్స్ పరంగా సాయి ధరం తేజ్ తన రోల్ కి ఫుల్ న్యాయం చేయగా డైలాగ్స్ అద్బుతంగా చెప్పాడు.

ఫస్ట్ టైం పార్టీ హెడ్ రమ్యకృష్ణతో హీరో సీన్ చాలా బాగొచ్చింది… ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా పర్వాలేదు అనిపించగా జగపతిబాబు రోల్ ఆకట్టుకుంది, రమ్యకృష్ణ రోల్ పవర్ ఫుల్ గానే ఉన్నా ఇంకా బాగా ఆ పాత్రను ఎలివేట్ చేయాల్సింది.. ఇక మిగిలిన యాక్టర్స్ కూడా పర్వాలేదు అనిపించారు. సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా మెప్పించింది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది, డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపించగా డైరెక్షన్ విషయానికి వస్తే దేవకట్టా డిఫెరెంట్ పొలిటికల్ కాన్సెప్ట్ ను కథగా బాగా చెప్పాడు కానీ చాలా నెమ్మదిగా చెప్పాడు….సెకెండ్ ఆఫ్ లో కథ చాలా స్లోగా సాగుతుంది…. పొలిటికల్ మూవీస్ అంటే…

ఇలా స్లో పేస్ తో సాగడం కామన్ కానీ వాటి ఆడియన్స్ డిఫెరెంట్ అని చెప్పాలి, రెగ్యులర్ మూవీస్ చూసే వాళ్ళ దృష్టితో చూస్తె సినిమా లెంత్ తగ్గి ఉండాల్సింది, కానీ ఇలాంటి స్లో పేస్ పొలిటికల్ మూవీస్ ఇష్టపడేవారికి సినిమా నచ్చుతుంది, డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ ని కానీ చాలా బాగా తెరకెక్కించాడు దేవకట్టా….

సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ పాయింట్, సాయి ధరం తేజ్ పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, క్లైమాక్స్ కొంచం హార్డ్ హిట్టింగ్ గా ఉన్నా మెప్పించడం లాంటివి మేజర్ హైలెట్స్ అవుతాయి అదే టైం లో లెంత్, స్లో నరేషన్, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ట్రైలర్ తోనే సినిమా ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిందో క్లియర్ గా చెప్పారు…. అది గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వెళితే…

సినిమా కొంచం స్లో నరేషన్ ఇబ్బంది పెట్టినా బాగుంది అనిపిస్తుంది, అలా కాకుండా సాయి ధరం తేజ్ రీసెంట్ మూవీస్ లా ఎంటర్ టైన్ మెంట్ నో, లేక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లా భావించి వెళితే మట్టుకు కొంచం నిరాశ కలిగిస్తుంది, ఓవరాల్ గా సినిమా కొంచం స్లో నరేషన్ తో ఉన్నా వన్స్ సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఈజీగా ఒకసారి చూడొచ్చు… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్… రెగ్యులర్ ఆడియన్స్ సినిమాను ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా లాంగ్ రన్ ఆధారపడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here