Home న్యూస్ RGV కరోనా వైరస్ మూవీ రివ్యూ….మంచి ఛాన్స్ మిస్ అయ్యింది!

RGV కరోనా వైరస్ మూవీ రివ్యూ….మంచి ఛాన్స్ మిస్ అయ్యింది!

0

రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో డైరెక్షన్ లో ఒకప్పుడు మంచి సినిమాలు వచ్చాయి కానీ తర్వాత పూర్తిగా నాసిరకం సినిమాలకే పరిమితం అయిన రామ్ గోపాల్ వర్మ నిర్మాత గా కూడా ఏమంత ఆకట్టుకునే సినిమాలు తీయలేదు. కరోనా టైం లో కొన్ని చెత్త సినిమాలు చేసి క్యాష్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ, ఇక లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక తన నిర్మాణంలో అగస్త్య మంజు డైరెక్షన్ లో తెరకెక్కిన…

కరోనా వైరస్ సినిమాను డిసెంబర్ 11 న రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేసి కరోనా తర్వాత రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ కొట్టాడు. లాక్ డౌన్ టైం లోనే పూర్తి అయిన సినిమా రిలీజ్ లేట్ గా అయ్యింది… మరి…. సినిమా ఎలా ఉందో ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే…ఒక కుటుంబంలో 7 గురు ఉంటారు, కరోనా టైం లో లాక్ డౌన్ పడ్డ సమయంలో కరోనా గురించిన భయాలు, టీవీ లో చూపెట్టిన ప్రోగ్రామ్స్ లాంటివి ఆ కుటుంబం మీద ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి… వాళ్ళు కరోనా భారిన పడ్డారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా శ్రీకాంత్ అయ్యంగర్ పాత్ర సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది, టేకింగ్ వీక్ గా ఉన్నా తన పెర్ఫార్మెన్స్ తో సినిమా చూసేలా చేశాడు శ్రీకాంత్…వంశీ చాగంటి రోల్ కూడా మెప్పించగా క్లైమాక్స్ లో పెర్ఫార్మెన్స్ ఇద్దరి పెర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. మిగిలిన యాక్టర్స్ కూడా ఉన్నంతలో మెప్పించారు.

స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ మొదట్లో బాగానే తర్వాత బోర్ కొట్టిస్తుంది… సంగీతం ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ రామ్ గోపాల్ వర్మ స్టైల్ లోనే విచిత్రమైన యాంగిల్స్ లో కొన్ని చిరాకు తెప్పించినా ఓవరాల్ గా ఓకే. ఇక డైరెక్షన్ పరంగా….

అగస్త్య మంజు సినిమా మొదలు పెట్టడం బాగానే మొదలు పెట్టినా కానీ తర్వాత రిపీట్ సీన్స్ తో నీరసమైన స్క్రీన్ ప్లే తో మెప్పించలేక పోయాడు, కానీ క్లైమాక్స్ లో మెప్పించి జస్ట్ ఓకే అనిపించుకునే ఔట్ పుట్ ఇచ్చాడు అని చెప్పాలి. మొత్తం మీద సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే…

శ్రీకాంత్ అయ్యంగర్ పెర్ఫార్మెన్స్, జగన్ బ్లీచింగ్ పౌడర్ పై సీన్, ఎమోషనల్ సీన్స్ మెప్పించగా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ పాయింట్ అందరం చూసేసి ఇప్పుడు పట్టించుకోని సిట్చువేషన్ లో ఉండటం, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం, టేకింగ్ వీక్ గా ఉండటం మేజర్ మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

మొత్తం మీద సినిమా రామ్ గోపాల్ వర్మ ఇతర సినిమాలతో పోల్చితే కొంచం బానే ఉన్నప్పటికీ ముందు చెప్పినట్లే ఇప్పుడు అందరం లైట్ తీసుకోవడంతో ఈ సినిమా కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది, రామ్ గోపాల్ వర్మ ఇతర సినిమాల మాదిరిగా ఈ సినిమాను…

అప్పుడే డైరెక్ట్ రిలీజ్ చేసి ఉంటె అప్పటి జనాల భయానికి, బయట పరిస్థితులకు మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి ఉండేది… కానీ ఇప్పుడు ఔట్ డేటెడ్ అయినపోయిన ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా.. ఎప్పుడూ ముందు ఆలోచించి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకునే వర్మ ఈ సారి లేట్ చేసి మంచి ఛాన్స్ ని వేస్ట్ చేసుకున్నాడు. సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here