బడ్జెట్ 4 కోట్లు…అమ్మింది 5.5 కోట్లు…టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

0
1370

  సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ, రిలీజ్ కి ముందు నుండి భారీ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు గా మారిన ఈ సినిమా ఆ అడ్వాంటేజ్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా సినిమా టాక్ వీక్ గా ఉండటం తో లాంగ్ రన్ లో జోరు చూపలేక చతికల బడింది. దానికి తోడూ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్

కాకపోవడం తో సినిమా ఫలితం పై మరింత ఎఫెక్ట్ అయ్యింది, సినిమా ఓవరాల్ బడ్జెట్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా ఆంధ్రప్రదేశ్ తో కలిపి 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినా అక్కడ సినిమా రిలీజ్ నోచుకోక పోవడం తో ఆ ప్లేస్ తప్పితే మిగిలిన బిజినెస్ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది.

ఇక సినిమా 6.2 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 3.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి డిసాస్టర్ గా మిగిలిపోయింది, కానీ ఓవర్సీస్ లో పెట్టిన డబ్బు కి మంచి లాభాలే వచ్చాయి, ఇక ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయిన పెద్దగా కలెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువే అని చెప్పాలి. దాంతో సినిమా ఓవరాల్ గా నిరాశనే మిగిలించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here