Home Uncategorized ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయం పై…. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ వీడియో!

ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయం పై…. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ వీడియో!

360
0

    అన్ సీజన్ లో కూడా చాలా మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రేర్ రికార్డ్ నే సొంతం చేసుకుంది, ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు ఫ్లాఫ్ అవ్వడం తర్వాత అసలు కథ నేను చెబుతా అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ లుక్ నుండి టీసర్ ట్రైలర్ వరకు అన్నీ ప్రేక్షకుల్లో సినిమా పై ఓ రేంజ్ లో క్యూరియాసిటీ పెరిగేలా చేశాయి.

ఇక ఆడియో ఈవెంట్ రామ్ గోపాల్ వర్మ మాటలు సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తించగా ఇప్పుడు భారీ క్రేజ్ నడుమ సినిమా ఈ నెల 22 న రిలీజ్ కానున్నా కానీ ప్రమోషన్స్ ని మరింత జోరు గా కొనసాగిస్తూ దుమ్ము లేపుతున్నాడు రామ్ గోపాల్ వర్మ.

పార్టీ పెట్టిన 8 నెలలలోనే అధికారంలోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత రాజకీయాల్లో జరిగిన పరిణామాలు, తర్వాత ఫ్యామిలీ లో జరిగిన కలహాతో కుంగిపోయిన ఎన్టీఆర్ నిజజీవితం లో అందరికీ ఎక్కువ విషయాలే తెలిసినా వాటిని తిరిగి అందరికీ నేటి తరం యువతకి క్లియర్ గా తెలియజేయడానికి…

సిద్ధం అయిన రామ్ గోపాల్ వర్మ సినిమా లో అనేక అంశాలను టచ్ చేశాడని తెలుస్తుంది, ఇక డైరెక్ట్ గా బాలయ్య నే స్టేజ్ పైనే టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ, మొదటి నుండి చంద్రబాబు నాయుడు ని కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా…

4 నిమిషాల వీడియో ఒకటి రిలీజ్ చేసి సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు పై ఎలాంటి కామెంట్స్ చేశాడో చూడండి అంటూ ఒక కొత్త వీడియో ని రిలీజ్ చేశారు. ఇప్పటికే అంచనాలు పెరిగిపోయిన ఈ సినిమా ఇలాంటి వీడియో లతో మరింత క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here