Home న్యూస్ రోర్ ఆఫ్ RRR మేకింగ్ వీడియో 24 గంటల రిపోర్ట్…కొత్త రికార్డ్ కొట్టారు కానీ!!

రోర్ ఆఫ్ RRR మేకింగ్ వీడియో 24 గంటల రిపోర్ట్…కొత్త రికార్డ్ కొట్టారు కానీ!!

1805
0

ఇండియాలో ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో అన్ని సినిమాల కన్నా ముందు నిలిచే సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్… బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రచ్చ చేయాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే వలన ఫస్ట్ వేవ్ సెకెండ్ వేవ్ ల వలన…

రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా అక్టోబర్ 13న ఎట్టి పరిస్థితులలో ఆడియన్స్ ముందుకు రావడం కన్ఫాం అయింది. ఇక సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన జక్కన్న రీసెంట్ గా సినిమా మేకింగ్ వీడియో ని రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది.

ఇద్దరు హీరోలను సమానంగా చూపెడుతూ మిగిలిన రోల్స్ ని కూడా బాగా ఇంట్రొడ్యూస్ చేస్తూ భారీ సెట్టింగ్ ల విజువల్స్ ని చూపెట్టిన రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో కి ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక మేకింగ్ వీడియో కి….

మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే సరికి సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ 6.2 మిలియన్ వ్యూస్ ని 452K లైక్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించినా ఇంకా ఎక్కువ రికార్డు వ్యూస్ అండ్ లైక్స్ ని సాధిస్తుంది అనుకున్నా ఎందుకో అలా జరగలేదు. ఇది వరకు ఎప్పుడో మూడేళ్ళ క్రితం వచ్చిన ప్రభాస్ సాహో సినిమా మేకింగ్ వీడియో కి ఒక ఛానెల్ లో…

6.02 మిలియన్ వ్యూస్ 328K లైక్స్ వచ్చాయి. రెండు ఛానెల్స్ కలిపి 8.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక్కడ సింగిల్ ఛానెల్ పరంగా న్యూ రికార్డ్ సొంతం అయినా మిగిలిన ఛానెల్స్ లో కలిపి 6.4 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది…3 ఛానెల్స్ లో రిలీజ్ అయింది ఈ వీడియో… మూడేళ్ళ క్రితం మూవీ కన్నా జస్ట్ కొంచం ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ రేంజ్ కి ఇంకా జోరు చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఫ్యూచర్ లో వచ్చే వీడియోలు ఎలాంటి రచ్చ చేస్తాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here