కన్నడ నుండి తెలుగు లోకి డబ్ అయిన రాబర్ట్ సినిమాను తెలుగు లో పోటి ఎక్కువగా ఉంది ఒక వారం రెండు వారాలు లేట్ గా రిలీజ్ చేసుకోండి అంటూ ఎంత చెప్పినా వినని టీం అనుకున్న టైం కే సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేశారు. కానీ జాతిరత్నాలు అండ్ శ్రీకారం డామినేషన్ ముందు మరో తెలుగు సినిమా గాలి సంపతే నిలవలేక పోయింది ఇక రాబర్ట్ వాషౌట్ అయిపొయింది.
సినిమా 10-12 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అయినా సొంతం చేసుకుంటుంది అనుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అంతకన్నా కూడా తగ్గి మొత్తం మీద 8-10 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం.
అది కూడా డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ తీయకుండా చెప్పిన కలెక్షన్స్, అవి కూడా తీసేస్తే సినిమా మొదటి రోజు 4-5 లక్షల రేంజ్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది, సోలోగా ఒకరోజు ముందు రిలీజ్ చేసుకున్న ఒక రోజు అడ్వాంటేజ్ అయినా ఉండేది, పోటి లో వాషౌట్ అయిపొయింది సినిమా.
కానీ ఆశ్యర్యకరంగా సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని పోస్టర్స్ రిలీజ్ చేశారు, అవి చూసి సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఇక కన్నడ ఒరిజినల్ విషయానికి వస్తే… సినిమా అల్టిమేట్ ఓపెనింగ్స్ ని అక్కడ సొంతం చేసుకుందని అంటున్నారు. కాగా అక్కడ KGF1 ఫస్ట్ డే 16.55 కోట్ల గ్రాస్ ని అందుకుంది… ఇప్పుడు ఈ సినిమా…
ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు కానీ అక్కడ తెలిసిన ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్క ప్రకారం సినిమా 12-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఇక తెలుగు లో వీకెండ్ లో సినిమా ఎలాంటి ప్రదర్శనని కనబరుస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది, బ్రేక్ ఈవెన్ కి 1.8 కోట్లు కావాలి, మరి సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఇక..