ఒకపక్క జాతితర్నాలు దెబ్బకి తెలుగు స్ట్రైట్ మూవీస్ అన్నీ కూడా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంటే… మరో పక్క డబ్బింగ్ మూవీ కి కలెక్షన్స్ రికార్డ్ లెవల్ లో వస్తున్నాయి అంటూ ఫేక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి ట్రోల్ కి గురి అవుతున్నారు రాబర్ట్ టీం. కన్నడ లో సినిమా రికార్డు ఓపెనింగ్స్ తో దుమ్ము లేపి ఉండొచ్చు కానీ తెలుగు కి వచ్చే సరికి ఇక్కడ పోటి కి తెలుగు సినిమాలే చేతులు ఎత్తేశాయి…
అలాంటిది ఈ రాబర్ట్ సినిమా ఫస్ట్ డే నే 3.12 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్స్ ని రిలీజ్ చేసుకున్నారు, ఇక వీకెండ్ కి ఏకంగా 6.19 కోట్ల గ్రాస్ వచ్చింది అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు… కొందరు అఫీషియల్ కాదు అంటున్నా.. సోషల్ మీడియా మొత్తం ఫ్యాన్స్ ఇవే అఫీషియల్ అంటూ చెబుతున్నారు.
ఇవి తప్పు అయితే కన్నడలో సినిమా 59 కోట్లుకు పైగా కలెక్షన్స్ తో వీకెండ్ పూర్తీ చేసుకుంది అన్నది కూడా తప్పు అవుతుంది.. ఇక సినిమా అసలు కలెక్షన్స్ విషయానికి వస్తే…తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Day 1 – 8.4L
Day 2 – 4.2L
Day 3 – 4L
Day 4 – 4.8L
Total : 21.4L Share
ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్స్…ఈ కలెక్షన్స్ కూడా డే 1 నుండి డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని తీయకుండా చెప్పిన లెక్క.. అవి తీస్తే…మిగిలేది చిల్లర… అయినా కానీ వీళ్ళు ఏకంగా 6.19 కోట్ల పోస్టర్ వదిలారు అంటే ఏ రేంజ్ లో ఫేక్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.
అన్ని కలెక్షన్స్ రావాలి అంటే మినిమమ్ 3.8 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చి ఉండాలి, సినిమా బ్రేక్ ఈవెన్ 1.8 కోట్లకు డబుల్ కన్నా ఎక్కువ ఫేక్ కలెక్షన్స్ ని యాడ్ చేసుకుని పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ డే నుండి ఒక్క హౌస్ ఫుల్ బోర్డు లేదు తెలుగు లో…అయినా ఈ ఫేక్ కలెక్షన్స్ ని చూసి అందరూ షాక్ అవుతున్నారు ఇప్పుడు.