కన్నడ నుండి తెలుగు లోకి డబ్ అయ్యి రిలీజ్ కి సిద్ధం అవుతున్న లేటెస్ట్ మూవీ రాబర్ట్, కన్నడ టాప్ స్టార్స్ లో ఒకరైన దర్శన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై కన్నడ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి, ఇక తెలుగు విషయానికి వస్తే హీరో ఎవరో పెద్దగా తెలియకపోవడంతో సినిమా కి ఇక్కడ అంతగా బజ్ లేదు కానీ, మహా శివరాత్రి టైం లో రిలీజ్ అవుతున్న సినిమాలలో…
మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఒకే ఒక్క సినిమా అవ్వడంతో మాస్ సెంటర్స్ లో పెర్ఫార్మ్ చేస్తుంది అన్న అంచనాలతో బరిలోకి దిగుతున్న ఈ సినిమాను ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సెంటర్స్ లో ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు. దాంతో మిగిలిన ఏరియాల్లో మొత్తం మీద బిజినెస్…
ఈ విధంగా ఉంది, సినిమా కి నైజం ఏరియా లో 50 లక్షలు, సీడెడ్ ఏరియా లో 20 లక్షలు, ఇక టోటల్ ఆంధ్రా ఏరియాలో 80 లక్షల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 1.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను…
ఈ సినిమా సొంతం చేసుకుంది, ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మినిమమ్ 1.8 కోట్ల వరకు షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం నెలకొంది, తెలుగు లో పోటి తీవ్రంగా ఉంది కాబట్టి ఈ సినిమా ఈ కలెక్షన్స్ టార్గెట్ ను ఎంతవరకు అందుకుంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేం కానీ…
ఒకవేళ కంటెంట్ బాగుండి సినిమా మాస్ ఆడియన్స్ కి నచ్చేలా ఉంటె కచ్చితంగా బిజినెస్ లో చాలా మొత్తాన్ని సినిమా రికవరీ చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి థియేటర్స్ కౌంట్ ని ఈ సినిమా సొంతం చేసుకోబోతుంది అంటున్నారు, మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.