బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబర్ట్ కన్నడ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా కన్నడ లో భారీ లెవల్ లో రిలీజ్ అవుతూ ఉండగా తెలుగు లో మాత్రం తీవ్ర పోటి లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయ్యింది, మొత్తం మీద తెలుగు లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్…
1.5 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది, ఇక సినిమా మొత్తం మీద తెలుగు రిలీజ్ ను అనౌన్స్ చేసినప్పుడు కచ్చితంగా 400 వరకు థియేటర్స్ ని అడిగారు, కానీ ఇక్కడ వాళ్ళు నో చెప్పారు.
క్రేజ్ తెచ్చుకోండి థియేటర్స్ ని పెంచుకోండి అన్నారు, అదే పనిలో తెలుగు లో సినిమాని సోషల్ మీడియా లో బాగా ప్రమోట్ చేశారు, సినిమా టీసర్ ట్రైలర్ లను బాగానే రీచ్ అయ్యేలా చేశారు, కానీ అదే సమయంలో ఈ సినిమా కి పోటిగా తెలుగు సినిమాలు కూడా బాగా ప్రమోట్ చేసుకోవడంతో…
తెలుగు సినిమాలకు ఎక్కువ రీచ్ లభించడం రాబర్ట్ కి తగ్గడం జరిగింది, దాంతో మిగిలిన సినిమాల కాంపిటీషన్ లో ఈ సినిమా కి నైజాంలో 55 థియేటర్స్, సీడెడ్ లో 35 థియేటర్స్ టోటల్ ఆంధ్రాలో 90 థియేటర్స్ లభించాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు 180 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది అని చెప్పాలి. 1.8 కోట్ల టార్గెట్ కి…
180 థియేటర్స్ సరిపోతాయి అని చెప్పాలి కానీ 400 పక్కా అని ఎక్స్ పెర్ట్ చేసిన టీం కి ఫైనల్ గా 180 కౌంట్ తెలియడంతో ఒకింత షాక్ అయ్యారు అని అంటున్నారు. అయినా కానీ తెలుగు లో పోటి తీవ్రంగా ఉంది కాబట్టి ఇదే ఫైనల్ అని చెప్పాలి, టాక్ పాజిటివ్ గా వస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ థియేటర్స్ సరిపోతాయి అని చెప్పొచ్చు.