ఏ ఇండస్ట్రీ హీరోకి లోకల్ గా మంచి మార్కెట్ ఉంటుంది కానీ వేరే చోట అంతే రేంజ్ మార్కెట్ సంపాదించుకోవడానికి టైం పడుతుంది, కానీ వేరే చోట అడుగు పెట్టిన మొదటి సినిమాకే మార్కెట్ అండ్ క్రేజ్ రావాలి అంటే ఎదో ఎప్పుడో కానీ ఇది జరగదు, లేటెస్ట్ గా టాలీవుడ్ లో తొలిసారి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్న కన్నడ స్టార్ హీరో దర్శన్… తను నటించిన లేటెస్ట్ మూవీ రాబర్ట్ ని మార్చ్ 11 న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు.
కాగా తెలుగు లో స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఎలా ఉంటుందో కన్నడ లో ఈ హీరోకి కూడా అలాంటి క్రేజ్ ఉంటుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా పెద్దగా హిట్స్ లేదు, మన దగ్గర వచ్చిన బృందావనం, డార్లింగ్ లాంటి సినిమాలను అక్కడ రీమేక్ చేసి మంచి హిట్స్ కొట్టాడు ఈ హీరో.
ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ రాబర్ట్ ని మార్చ్ 11 న రిలీజ్ చేయబోతుండగా ఇతర కన్నడ హీరోలు తెలుగు లో తమ సినిమాలను రిలీజ్ చేయడం మొదలు పెట్టగా ఈ హీరో కూడా లాస్ట్ ఇయర్ కురుక్షేత్రం సినిమాతో వచ్చినా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, దాంతో ఇప్పుడు రాబర్ట్ తో మరోసారి తన లక్ ని పరీక్షించుకోవాలని చూస్తుండగా…
ఈ సినిమా రిలీజ్ ను తెలుగు లో కూడా ప్లాన్ చేయగా మార్చ్ 11 న తెలుగులో శర్వానంద్ మూవీ ‘శ్రీకారం’తో పాటు మంచు విష్ణు చిత్రం ‘మోసగాళ్లు’, శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్‌ల ‘గాలి సంపత్’, నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణల ‘జాతి రత్నాలు’ ఇలా 4 సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న టైం లో ఈ సినిమా కి 400 థియేటర్స్ ఇక్కడ కావాలని డిమాండ్ చేశాడట ఈ హీరో.. దాంతో ఇక్కడ అన్ని థియేటర్స్ ఇవ్వలేమని కావాలంటే ఒక వారం ఆగి రిలీజ్ చేస్తే చూస్తామని చెప్పడంతో ఈ హీరో కి కోపం వచ్చి…
కన్నడలో కన్నడ సినిమాల కన్నా తెలుగు, తమిళ్ సినిమాలే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాం… మీరు మాకు ఇవ్వరా ఇలా గైతే మేం కూడా మీ సినిమాలకు ఇక్కడ థియేటర్స్ ఇవ్వం అంటూ వాదించారట. దాంతో ఇప్పుడు ఇరు వర్గాలకి చర్చలు జరుగున్నట్లు సమాచారం. ఫైనల్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేస్తారో చూడాలి ఇక…