బాక్స్ ఆఫీస్ దగ్గర 2020 టైంలో భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టినా తర్వాత టైంలో క్లీన్ హిట్ ను సొంతం చేసుకోలేక పోయిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా తో ఇప్పుడు కంబ్యాక్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద డీసెంట్ అంచనాలు ఉండగా…
ట్రైలర్ కూడా క్లిక్ అవ్వడం ప్రమోషన్స్ గట్టిగానే చేయడంతో ఓపెనింగ్స్ కచ్చితంగా బాగుంటాయని అందరూ అనుకుంటూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కొంచం యావరేజ్ లెవల్ లోనే ఉన్నాయి..
సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 550 నుండి కొన్ని ఇష్యూలు సెట్ అయితే 600వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది… ఇక వరల్డ్ వైడ్ గా 850 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇప్పటి వరకు టోటల్ గా ఇండియాలో…
1.7 కోట్ల రేంజ్ లోనే ఉండగా ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి ఓవరాల్ గా 2.5 కోట్ల లోపే బుకింగ్స్ ఉన్నాయి. దాంతో సినిమా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి. టాక్ బాగుంటే షో షో కి కలెక్షన్స్ పరంగా జోరు చూపించే…
అవకాశం ఎంతైనా ఉండగా ప్రస్తుతానికి ఉన్న బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మాత్రం మొదటి రోజు సినిమా అటూ ఇటూగా 2.5-3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉండగా సినిమా కి వచ్చే టాక్ ను బట్టి కలెక్షన్స్…
షో షో కి పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… పోటి కూడా ఉన్న నేపధ్యంలో టాక్ యునానిమస్ లెవల్ లో ఉంటే జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి తరలి వచ్చే అవకాశం ఉంటుంది. మరి నితిన్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.