అందరికీ గుర్తు ఉండే ఉంటుంది…మూడేళ్ళ క్రితం తెలుగు సినిమాల టికెట్ రేట్స్ ను ఆంధ్రాలో తగ్గించేశారు…దాంతో సినిమాల బడ్జెట్ కి ఉండాల్సిన రేటు ఉంటే చాలు మరీ ఎక్కువ రేటు అవసరం లేదు అంటూ ప్రతీ సినిమా నిర్మాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం టికెట్ హైక్స్ గురించి అడగడం జరిగేది…దాంతో…పెద్ద బడ్జెట్ సినిమాలకు…
పెట్టిన బడ్జెట్ ను బట్టి టికెట్ హైక్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు…కానీ తర్వాత ప్రభుత్వం మారడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా కావాలి అనుకున్న సినిమాకి టికెట్ హైక్స్ ఇస్తూ ఉండగా…ఇప్పుడు మార్చ్ లాంటి అన్ సీజన్ తర్వాత సమ్మర్ మొదలు అవుతూ ఉండగా…
ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా, మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) సినిమాలు రిలీజ్ కాబోతూ ఉండగా…
రెండు సినిమాలకు కూడా ఇప్పుడు ఆంధ్రలో టికెట్ రేట్స్ ను వారం వరకు పెంచుకునే అవకాశం ఇచ్చారు…సింగిల్ స్క్రీన్స్ లో 50, మల్టీప్లెక్సులలో 75 వరకు టికెట్ హైక్స్ వారం వరకు ఉండబోతున్నట్లు సమాచారం…పెద్ద సినిమాల మాదిరిగా ఈ సినిమాలకు…
150-200 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయ్యాయా అంటే కాదు…రాబిన్ హుడ్ కి 75 కోట్ల రేంజ్ లో మ్యాడ్2 కి 25 కోట్ల రేంజ్ లోనే బడ్జెట్ అవ్వగా వీటికి కూడా టికెట్ హైక్స్ ఇవ్వడం చూసి ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్నా మీడియం రేంజ్ మూవీస్ కి కూడా టికెట్ హైక్స్ అంటే…
ఇక జనాలు థియేటర్స్ కి రావడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూత్ ఎగబడి వచ్చే సినిమాలకు కూడా టికెట్ హైక్స్ ఎక్కువగా పెట్టడం ఎంతవరకు సమంజసమో మేకర్స్ కే తెలియాలి. ఇక ఈ టికెట్ హైక్స్ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై ఎంతవరకు ఉంటుందో చూడాలి.