Home న్యూస్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూ…రేటింగ్….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

రాబిన్ హుడ్ మూవీ రివ్యూ…రేటింగ్….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఆల్ మోస్ట్ 5 ఏళ్ళుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా భారీ లెవల్ లో రూపొంది సమ్మర్ కానుకగా భారీ పోటిలో రిలీజ్ అవ్వగా….నితిన్ కి ఎంతవరకు కంబ్యాక్ మూవీ లా నిలిచిందో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…అనాధ అయిన హీరో డబ్బున్న వాళ్ళ దగ్గర దోచుకుని అనాథలకు పంచిపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తాను సేఫ్ గా ఉండటానికి ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు…తర్వాత ఒక బిజినెస్ డీల్ మీద ఇండియాకి వచ్చే హీరోయిన్ ని…

కాపాడే భాద్యత తీసుకున్న తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి…అసలు హీరో మోటో ఏంటి లాంటి విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించగా కొంచం కిక్ సినిమా ను కూడా పోలి ఉంటుంది కానీ…

కొద్ది సేపే ఆ ఫీలింగ్ కలిగి కథ బ్యాగ్ డ్రాప్ ను స్విచ్ చేస్తాడు డైరెక్టర్….కామెడీ పరంగా ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించేలా కామెడీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ లో పర్వాలేదు అనిపించింది. కానీ సెకెండ్ ఆఫ్ లో సెంటిమెంట్ అండ్ మెలో డ్రాగా కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది.

అలా కాకుండా కామెడీ డోస్ నే పెంచి చెబితే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది అనిపించింది. నితిన్ మరోసారి తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేసి ఫుల్ ఎనర్జీతో కామెడీతో ఆకట్టుకున్నాడు. హీరోయిజం ఎలివేట్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపించగా…శ్రీలీల కూడా ఉన్నంతలో బాగానే మెప్పించగా రాజేంద్రప్రసాద్…

తన రోల్ వరకు బాగా చేయగా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. డేవిడ్ వార్నర్ సీన్స్ మరీ ఇంపాక్ట్ ఫుల్ గా లేవు కానీ ఓకే… ఇక సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్ గానే ఉంది. సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా ఉండి ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా బాగుండేది….

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు ఓకే కానీ సెకెండ్ ఆఫ్ లో ట్రాక్ తప్పింది…తిరిగి ప్రీ క్లైమాక్స్ నుండి జోరు అందుకున్నా కీలకమైన ఎపిసోడ్ లు అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక వెంకి కొడుముల తీసిన రెండు సినిమాలతో పోల్చితే…

రాబిన్ హుడ్ ఆ సినిమాల రేంజ్ కి వెళ్ళలేదు కానీ ఉన్నంతలో భీష్మ తర్వాత నితిన్ మూవీస్ లో బెస్ట్ అని చెప్పొచ్చు…. మరీ ఓవర్ ఎక్స్ పెర్టేషన్స్ లాంటివి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే అక్కడక్కడా కొంచం ట్రాక్ తప్పినట్లు అనిపించినా ఓవరాల్ గా డీసెంట్ మూవీ లా అనిపిస్తుంది ఈ సినిమా…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here