Home న్యూస్ రాబిన్ హుడ్ ట్రైలర్ రివ్యూ….నితిన్ కి మాస్ కంబ్యాక్ పక్కా!!

రాబిన్ హుడ్ ట్రైలర్ రివ్యూ….నితిన్ కి మాస్ కంబ్యాక్ పక్కా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో సాలిడ్ కంబ్యాక్ కి సిద్ధం అయ్యాడు….తనతో భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వెంకి కొడుముల డైరెక్షన్ లో రూపొందుతున్న…

ఈ సినిమా మీద డీసెంట్ బజ్ ఉండగా..టీం సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేయడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక లేటెస్ట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూశాక నితిన్ కి ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇక కన్ఫాం అనిపించే రేంజ్ లో.

సినిమా ట్రైలర్ మెప్పించింది అని చెప్పాలి…కొద్ది వరకు సినిమా స్టోరీ పాయింట్ ఎలా ఉండబోతుందో కూడా ట్రైలర్ లోనే చూపించారు….డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బుని దొంగలించే హీరో ఒక బిజినెస్ డీల్ మీద ఇండియాకి వచ్చే హీరోయిన్ ని ట్రాప్ చేయడానికి…

రాజేంద్రప్రసాద్ తో కలిసి ఒక టీం ఫామ్ చేస్తాడు…ఈ క్రమంలో హీరోతో లవ్ లో పడిన హీరోయిన్ తర్వాత ఏం చేసింది…హీరో దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు లాంటి పాయింట్స్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కొంచం కిక్ మూవీ టచ్ తో పాటు…

పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అనేక కమర్షియల్ మూవీస్ ని మళ్ళీ గుర్తు చేస్తున్నా కూడా కంప్లీట్ గా ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లో రూపొందుతున్న రాబిన్ హుడ్ నితిన్ కి కొత్త తరహా కాన్సెప్ట్ అవ్వడంతో ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ కి…

ఈ సినిమాతో మంచి రిజల్ట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. టాక్ ఏమాత్రం బాగున్నా కూడా ఓపెనింగ్స్ కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉన్న రాబిన్ హుడ్ ట్రైలర్ లానే సినిమా ఆకట్టుకుంటే నితిన్ ఎక్స్ లెంట్ కంబ్యాక్ అయితే ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here