బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 5 ఏళ్ళుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమాతో తన లక్ ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకోగా…
మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది….స్టోరీ పాయింట్ ను ఏమి రివీల్ చేయడం లేదు కానీ డబ్బున్న వాళ్ళ దగ్గర నుండి డబ్బు దొంగలించి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చే హీరో ఒక బిజినెస్ డీల్ మీద ఇండియాకి వచ్చే హీరోయిన్ ని ట్రాప్ చేయాలనీ చూస్తాడు..
ఈ క్రమంలో ఏం జరిగింది ఆ తర్వత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వెంకి కొడుముల అంటే కామెడీ ఎంటర్ టైనర్స్ ని తీయడంతో పాటు అందులో ఒక చిన్న మెసేజ్ ను కూడా జోడిస్తాడు…ఈ సినిమా విషయంలో కూడా అదే మ్యాజిక్ చేశాడు మరోసారి…
కొంచం కథ పాయింట్ కిక్ మూవీని పోలినట్లు అనిపించినా ఓపెన్ అయినప్పటి నుండి కూడా కామెడీ సీన్స్ తో ఆకట్టుకుంటూ సాగిపోయిన సినిమా లవ్ సీన్స్ కొంచం బోర్ అనిపించినా కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా మెప్పించి…
సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా సెకెండ్ ఆఫ్ కామెడీ తో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పర్వాలేదు అనిపించేలా ఉండటం తర్వాత ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ దాకా సినిమా ఫుల్ జోరుతో సాగడంతో ఎక్కడా కూడా ఏమాత్రం బోర్ ఫీల్ అవ్వలేదు అనిపించింది…
ఓవరాల్ గా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా సెకెండ్ ఆఫ్ ఓవరాల్ గా యావరేజ్ రేంజ్ లో అనిపించింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా పూర్తి అయ్యే టైంకి యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో ఉందని చెప్పాలి…
ఓవరాల్ గా ప్రీమియర్స్ నుండి సినిమాకి డీసెంట్ రిపోర్ట్స్ ఇప్పుడు వినబడుతూ ఉండగా రెగ్యులర్ షోలకు టాక్ ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. నితిన్ రీసెంట్ మూవీస్ లోకి బెస్ట్ ఔట్ పుట్ ఉన్న మూవీ అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు అనిపించే రేంజ్ లో..
దాంతో రెగ్యులర్ షోలకు ఇంకా బెటర్ టాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న రాబిన్ హుడ్ మూవీ నితిన్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఆడియన్స్ నుండి ఫైనల్ గా సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.