బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న టాలీవుడ్ హీరోలలో ఒకరైన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా తో ఇప్పుడు మంచి కంబ్యాక్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ డీసెంట్ బజ్ ఉండగా దానికి తోడూ టీం అంతా కలిసి సినిమాను…
ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉండటం భారీగా కలిసి రాబోతుంది అని చెప్పాలి. దాంతో పాటు ఇక టాక్ ఒక్కటి కనుక ఆశించిన విధంగా వస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ కి సినిమా సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.
ఇక ఈ సినిమా బడ్జెట్ పరంగా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ బడ్జెట్ తో పూర్తి అయ్యిందని అంటున్నారు…ముందు 45-50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయాలి అనుకున్నా కూడా షూటింగ్ డేస్ పెరిగిపోవడంతో పాటు…
రిలీజ్ కూడా పుష్ అవుతూ రావడంతో అనుకున్న బడ్జెట్ కన్నా కూడా ఓవరాల్ బడ్జెట్ అలా అలా పెరిగిపోయి ఇప్పుడు ఓవరాల్ గా 70-72 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా నిర్మాణం పూర్తి అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రమోషన్స్ అండ్ ప్రింట్స్ ఖర్చులు కలిపి…
ఓవరాల్ గా మేకర్స్ కి 75 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా నిర్మాణం అయ్యిందని అంటున్నారు….ఈ రేంజ్ బడ్జెట్ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న నితిన్ మీద పెట్టడం రిస్క్ అయినా కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది అని అంటూ ఉండటంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన మొత్తం సాలిడ్ గా రికవరీ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.