రెగ్యులర్ ఆడియన్స్ సినిమాలో అన్ని బాగున్నాయి కానీ కథ చెప్పే విధంగా గెస్ చేసే విధంగా ఉండటం ఒక్కటే మైనస్ పాయింట్ అని అంటున్నారు. అది తప్పితే సినిమా మొత్తం అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని చెబుతున్నారు.
ఇక ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మొదటి ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకు ఎంజాయ్ చేసే విధంగా ఎలాంటి ఇబ్బంది కలిగించే సీన్స్ లేకుండా ఉందని అంటున్నారు. ఒక్క అక్షయ్ కుమార్ హెవీ మేకప్ తో ఉన్న సీన్స్ మాత్రమె బయపడే విధంగా ఉన్నాయని…
అవి తప్పితే మిగిలిన అన్ని సీన్స్ కూడా అబ్బుర పరిచాయని వారు చెబుతున్నారు. ఓవరాల్ సినిమా మార్నింగ్ నుండి నైట్ షోల దాకా అన్ని షోల కి ఒకే రకమైన టాక్ ని సొంతం చేసుకుని సత్తా చాటింది అని చెప్పొచ్చు. ఇక సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 360 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఎంతవరకు రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ టాక్ తో సినిమా వీకెండ్ లోనే సాలిడ్ వసూళ్ళతో భీభత్సం సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.