కన్నడ గడ్డపై 35 కోట్లు…ఆల్ టైమ్ టాప్???

0
136

  సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ లో శివాజీ, రోబో లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న సినిమా రోబో 2.0… అత్యంత భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మూవీ ఈ నెల 29 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. కాగా ఒక్కో ఏరియాలో సినిమా ఫైనల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కంప్లీట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా కర్ణాటకలో లో సినిమా బిజినెస్ కంప్లీట్ అయింది.

సినిమాను అక్కడ ఓవరాల్ గా 35 కోట్ల రికార్డ్ లెవల్ రేటు కి కొన్నట్లు సమాచారం.. అందులో ఒక కండీషన్ కూడా ఉందట. సినిమా 35 కోట్ల కి పైగా షేర్ వసూల్ చేస్తే ఆ బిజినెస్ వర్తిస్తుంది. ఒకవేళ 30 కోట్ల కి అటూ ఇటూ గా వస్తే 5 కోట్లు రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుంది.

కాగా ఓవరాల్ గా కర్ణాటక లో ఈ సినిమా బిజినెస్ పరంగా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ని దక్కించుకుంది. మొదటి ప్లేస్ లో బాహుబలి పార్ట్ 2 42 కోట్లకు పైగా బిజినెస్ తో టాప్ లో ఉంది. ఇప్పుడు రెండో ప్లేస్ లో రోబో 2.0 సినిమా చోటు దక్కించుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!