ఎప్పుడూ మన ఇండస్ట్రీ విషయాలేనా…ఇతర ఇండస్ట్రీలలో కూడా ఏమవుతుందో తెలుసు కోవాలి కదా… మన ఇండస్ట్రీ తో పోల్చితే మలయాళ ఇండస్ట్రీ మార్కెట్ చిన్నదే. కానీ వాళ్ళ దగ్గర వచ్చే క్వాలిటీ కంటెంట్ మూవీస్ వేరే ఇండస్ట్రీలలో రావు, పెద్ద చిన్న అన్న తేడా లేకుండా మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయి. రీసెంట్ టైం లో అక్కడ మోహన్ లాల్ మరియు మమ్ముట్టి నటించిన కొత్త సినిమాలు ఫ్లాఫ్ అయిన చోట….
ఓ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది, ఆ సినిమానే “రోమాంచం”… కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమా నాన్ స్టాప్ గా నవ్వులపూవులు పూయించడంతో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు ఫ్లాఫ్ అయిన చోట ఈ సినిమా కేరళలో ఇప్పటి వరకు 34 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 55 కోట్ల గ్రాస్ ను అందుకుని రిలీజ్ అయ్యి…
4 వారాలు అవుతున్నా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ 60 కోట్ల గ్రాస్ మార్క్ ని వైపు దూసుకు పోతుంది. ఓ చిన్న సినిమా ఈ రేంజ్ లో విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమా పై ఇతర భాషల్లో కూడా ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలో OTT లో రిలీజ్ అయ్యే ఈ సినిమాకి అన్ని భాషల నుండి సాలిడ్ రెస్పాన్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు.