ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా కి ఇతర రాష్ట్రాలలో కొత్త కేసుల ఇబ్బందుల వలన ఎదురుదెబ్బ పడుతూ మహారాష్ట్ర, డిల్లీ లాంటి మేజర్ ఏరియాలలో గట్టి దెబ్బలే పడుతూ ఉన్న టైం లో సినిమా…
ఇక ఆడియన్స్ ముందుకు జనవరి 7న వచ్చే అవకాశం తక్కువగా ఉందని, సినిమా పోస్ట్ పోన్ అయ్యి కొత్త డేట్ ని అనౌన్స్ చేయోచ్చు అంటూ వార్తలు జోరుగా ప్రచారం అవుతూ ఉండగా ఈ విషయం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీం వరకు వెళ్ళగా టీం దీనిపై స్పందిస్తూ…
సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా అనుకున్నట్లే జనవరి 7న ఆడియన్స్ ముందుకు రావడం ఖాయం అంటూ మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అన్న వార్తలకు పులిస్టాప్ పెట్టేశారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 7న ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటే ఆర్ ఆర్ ఆర్ రికార్డుల రాంపేజ్ ని ఎంజాయ్ చేయొచ్చు.