ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ వలన అనేక ఫ్యామిలీస్ ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే, మరో పక్క సినిమాల పరంగా అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోగా, సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు ఏవి ఎప్పుడు వస్తాయో అన్నది ఎవ్వరికీ అంతుపట్టకుండా ఉంది, ఇలాంటి టైం లో టాలీవుడ్ ప్రజెంట్ బిగ్గెస్ట్ మూవీ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా పై కూడా ఈ ఎఫెక్ట్ గట్టిగా నే ఉందని చెప్పాలి.
ఇప్పటికే ఈ ఇయర్ జులై 31 న రిలీజ్ అనుకున్నా అప్పటికి వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వదు అని సేఫ్ సైడ్ లో జనవరి 8 న సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేసినా ఇప్పుడు లాక్ డౌన్ ఆల్ మోస్ట్ 45 రోజులుగా కొనసాగుతుండటం…
మరో నెల పాటు మినిమమ్ షూటింగ్స్ కి అనువుగా వాతావరణం ఉండేలా లేక పోవడం లాంటివి ఈ సినిమా కి కూడా ఎదురు దెబ్బ కొట్టే చాన్స్ ఉంది, దాంతో ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి నుండి సమ్మర్ రేసు లో నిలిచే అవకాశమే ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది.
దీనికి తోడూ ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం, కొన్ని ఏరియాల రైట్స్ కోసం కొందరు ఆల్ రెడీ సినిమా కి భారీ అడ్వాన్స్ ఇచ్చారని టాక్ ఉంది, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృశ్యా బిజినెస్ తగ్గించుకోవాలని వారు కోరుతున్నారట. సినిమా బడ్జెట్ దృశ్యా అది సాధ్యం అయ్యేలా లేడని టాక్…
కానీ వారు మాత్రం వచ్చే ఏడాది వరకు అన్నీ సర్దుకుంటాయని సినిమా క్రేజ్ దృశ్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా దుమ్ము లేపుతుందని వారు చెబుతున్నారని అంటున్నారు. ఓవరాల్ గా మరీ అనుకున్న రేంజ్ బిజినెస్ కాకున్నా కొంచం లెక్క తగ్గే అవకాశం ఉంది అలాగే రిలీజ్ డేట్ విషయం లో మరోసారి లెక్క మిస్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు..