యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా పై ఉన్న అంచనాలు సాలిడ్ గా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆ అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ….
ఇతర రాష్ట్రాలలో కూడా కుమ్మేసినా హిందీ లో మాత్రం రిలీజ్ కి ముందు ఉన్న పరిస్థితులు అసలు ఏమాత్రం అనుకూలంగా లేక పోవడంతో అక్కడ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో అన్న అనుమానాలతో సినిమా రిలీజ్ అయింది. దానికి తోడూ అక్కడ ఈ సినిమా కన్నా ముందు రిలీజ్ అయిన…
రాధే శ్యామ్ ఘోరమైన పరాజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ ఇంపాక్ట్ కూడా ఆర్ ఆర్ ఆర్ మీద ఉంటుంది అనుకున్నారు అంతా… సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా స్లోగానే మొదలు అయి తర్వాత పాజిటివ్ టాక్ ప్రతీ రోజూ కలెక్షన్స్ ని పెంచుకుంటూ పరుగును సాలిడ్ గా కొనసాగించిన సినిమా…
ఇప్పుడు 12 రోజులు పూర్తీ అయ్యే టైం కి 198 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 13 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ప్రతిష్టాత్మక 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. హిందీ లో సౌత్ డబ్బింగ్ మూవీస్ లో ఈ మార్క్ ని అందుకున్న….
రెండో సౌత్ డబ్ మూవీ గా నిలవగా ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు రాజమౌళివే అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో 250 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం… మరి ఆ రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తాయా లేక మించుతాయో చూడాలి.