యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మమ్మోత్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా సినిమా 50 రోజులను పూర్తీ చేసుకున్న తర్వాత….
పరుగును ఆల్ మోస్ట్ ఒక్కో ఏరియాలో పూర్తీ చేసుకోగా కేరళలో సినిమా టోటల్ రన్ ని పూర్తీ చేసుకుని అక్కడ మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు అనిపించేలా ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని హిట్ గా నిలిచి దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి…
సినిమాను కేరళలో మొత్తం మీద 9 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా అక్కడ మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నా తర్వాత కొంచం స్లో డౌన్ అవ్వగా అయినా కానీ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది.
టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేరళలో 24.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా అందులో నుండి థియేట్రికల్ షేర్ అప్ డేట్ అయిన కలెక్షన్స్ లెక్కలతో మొత్తం మీద 11 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…. ఈ లెక్క ప్రకారం సినిమా 9 కోట్ల బిజినెస్ కి 9.5 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెంట్ టార్గెట్…
అనుకున్నా కానీ సినిమా మొత్తం మీద 1.5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా మలయాళంలో నిలిచింది అని చెప్పాలి మొత్తం మీద… కేరళలో సినిమా లాంగ్ రన్ లో మరింత ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ కనుక లేకుండా ఉంటే. అయినా కానీ సినిమా మొత్తం మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును ముగించింది.