మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ప్రీవియస్ రికార్డులను అన్నీ కూడా బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ ను నమోదు చేయగా… ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది కానీ అన్ని చోట్లా కన్నా కూడా…
టీం భారీ ప్రమోషన్స్ చేసిన హిందీ బెల్ట్ లో మాత్రం ఎంత ప్రమోషన్స్ చేసినా కానీ సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజు వరకు కూడా చాలా తక్కువగానే ఉండటం తో ఇక సినిమా 12-13 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని….
ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా అందరూ నిరాశ పడ్డారు, బాహుబలి 2 అక్కడ 40.73 కోట్లు వసూల్ చేసింది, అది అందుకోవడం అసాధ్యం అని అందరికీ తెలిసినా రెండో ప్లేస్ లో ఉన్న సాహో 24.40 కోట్ల మార్క్ ని అందుకోవడం పక్కా అనుకున్నా సినిమా బుకింగ్స్ ఆ రేంజ్ లో లేక పోవడం తో…
మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయిన సినిమా షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ తొలిరోజు ఏకంగా 20.07 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని హిందీ లో సౌత్ డబ్ మూవీస్ లో ఆల్ టైం మూడో ఓపెనర్ గా నిలిచింది. ఇక రెండో రోజు ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపిస్తున్న సినిమా మినిమమ్ ఈ రోజు అక్కడ…
24 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని సాధించే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, రికార్డ్ ఓపెనింగ్స్ ని అందుకోక పోయినా కానీ మంచి గ్రోత్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకోవడానికి అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో అందుకోవాల్సిన టార్గెట్ పెద్దదే కాబట్టి వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…