బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా కి ఇప్పటికీ టికెట్ హైక్స్ భారీగానే ఉండటం తో ఆ ఇంపాక్ట్ మల్టీ ప్లెక్సులలో ఆక్యుపెన్సీ తగ్గేలా చేస్తున్నా సింగిల్ స్క్రీన్స్ లో రేట్లు తగ్గడం తో కాలేజ్ స్టూడెంట్స్…
కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ సింగిల్ స్క్రీన్స్ కి వస్తున్నారు, దాంతో ఆ ఇంపాక్ట్ వలన సింగిల్ స్క్రీన్స్ వీక్ డేస్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉండటం విశేషం, హైదరాబాదు RTC X రోడ్స్ లో 4 మరియు 5 వ రోజు వర్కింగ్ డేస్ ఉన్నా కానీ…
ఆర్ ఆర్ ఆర్ కి హౌస్ ఫుల్ బోర్డులు పడుతూనే ఉన్నాయి, ఇక ఆంధ్రలో కూడా చాలా మాస్ సెంటర్స్ లో రేట్లు తగ్గించడంతో జనాలు భారీగానే వస్తున్నారు, రేట్లు 10 రోజుల తర్వాత ఇంకా తగ్గుతాయి కాబట్టి చూడని వాళ్ళు అప్పుడు చూసే అవకాశం చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్స్ లో చూసే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి.