బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా లెవల్ లో భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న మమ్మోత్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి ఎక్స్ లెంట్ హైప్, భారీ స్టార్ కాస్ట్ లాంటివి బిగ్గెస్ట్ ఎసెట్స్ అయినా ఇప్పుడు సినిమా కి ఒక్కటి మాత్రం మైనస్ ఎఫెక్ట్ ని చూపుతుంది అని చెప్పాలి ఇప్పుడు…
అదే టికెట్ హైక్స్…. రీసెంట్ టైం లో అన్ని సినిమాలకు కూడా టికెట్ హైక్స్ పెంచాలి అంటూ అందరు కోరుకున్నారు, అది ఎట్టకేలకు ఆర్ ఆర్ ఆర్ సినిమా కి సాధ్యం అయింది, కానీ టికెట్ హైక్స్ ఊహించిన దాని కన్నా కూడా భారీ గా పెట్టడం ఇప్పుడు ఎఫెక్ట్ కి కారణం……ఆంధ్రలో సినిమా టికెట్ హైక్స్ ఏకంగా 350 నుండి 390 వరకు ఉన్నాయి…
ఇక నైజాం లో అయితే ఏకంగా మల్టీ ప్లెక్సులలో 413 టికెట్ రేట్స్ పెట్టగా సింగిల్ స్క్రీన్స్ లో 235 రేటు ని ఫిక్స్ చేశారు… రీసెంట్ టైం లో ఏ సినిమా విషయంలో కూడా ఇవి హైయెస్ట్ రేట్లు అనే చెప్పాలి…ఇది వరకు పెద్ద సినిమాలు అన్నింటికీ కూడా ఎక్కువలో ఎక్కువ 250 వరకు రేటు ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో 175 నుండి 200 వరకు రేట్లు ఉండేవి….
కానీ ఆర్ ఆర్ ఆర్ కి ఈ రేట్లు డబుల్ చేయడంతో ఆ ఇంపాక్ట్ బుకింగ్స్ పై ఎఫెక్ట్ చూపుతుంది, ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్ ఫస్ట్ డే ఎలాగూ రేట్లు ఎలా ఉన్నా చూస్తారు… కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు వీకెండ్ లో ఈ రేట్స్ ని బరిస్తారో చూడాలి. ఇక ఇదే ఎఫెక్ట్ ఇండియా వైడ్ గా కూడా చాలా మల్టీ ప్లెక్సులలో ఉండగా కొన్ని చోట్లా తెలుగు రాష్ట్రాలను మించి రేట్లు ఉండటంతో నార్త్ సైడ్ బుకింగ్స్ పై ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తుంది…
ఇలా కావాలి కావాలి అని ఎదురు చూసిన టికెట్ హైక్స్ అంచనాలను మించి పెట్టడం ఒక్కటే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కి కొంచం మైనస్ పాయింట్ అని చెప్పాలి. కానీ వీకెండ్ తర్వాత రేట్లు తగ్గించబోతున్నారు కానీ మల్టీ ప్లెక్సులలో 350 ప్లస్ రేట్లు, ఆంధ్ర లో 300 వరకు రేట్లు ఉండటం తో కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్ కి తరలివస్తారో చూడాలి… సినిమా బడ్జెట్ కూడా పెద్దదే అవ్వడంతో రికవరీ కి ఈ రేట్లు పెట్టక తప్పని పరిస్థితి….