బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని రోజుల్లో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేయడానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ లెవల్ లో సిద్ధం అవుతుంది, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై తెలుగు లో అయితే విపరీతమైన అంచనాలు ఉండగా మిగిలిన చోట్ల కూడా మంచి అంచనాలు ఉన్నాయి కానీ…
రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రావడం తో ఆ ఇంపాక్ట్ సినిమా ప్రమోషన్స్ పై పడగా సంక్రాంతి కి మిస్ అయినా ఇప్పుడు సమ్మర్ రేసులో వస్తున్న సినిమా కి మళ్ళీ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో ప్లాన్ చేసిన జక్కన్న మిగిలిన చోట్ల కూడా ఫుల్ జోష్ వచ్చేలా చేస్తున్నాడు అని చెప్పాలి.
ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో మాత్రం సెన్సేషనల్ క్రేజ్ నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా నైజాం ఏరియాలో ఇప్పుడు చరిత్రకెక్కె బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి. సినిమా ఒక్క నైజాం ఏరియాలోనే ఆల్ మోస్ట్ ప్రీవియస్…
బిగ్గెస్ట్ మూవీస్ అన్నింటి కన్నా కూడా భారీ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం, రీసెంట్ టైం లో నైజాం లో బిగ్ మూవీస్ కి 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో బిజినెస్ లు జరగగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఇక్కడ ఏకంగా GST తో కలిపి 75 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం అయ్యిందని సమాచారం….
ఈ రేంజ్ లో బిజినెస్ అంటే అది మాములు విషయం కాదనే చెప్పాలి. చరిత్రలో నిలిచి పోయే బిజినెస్ ను ఇక్కడ సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మూడు వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను ఆపే సినిమా లేక పోవడంతో కచ్చితంగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.