Home న్యూస్ RRR మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

RRR మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ లెవల్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. సినిమా పై ఉన్న హైప్ దృశ్యా వరల్డ్ వైడ్ గా 10 వేలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుని దుమ్ము లేపిందా లేదా అన్న విషయాలు తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే….నిజాం రాజుని కలవడానికి వచ్చిన బ్రిటిష్ దొర గోండ్ల పిల్లను బలవంతంగా తీసుకెళతాడు….. ఈ విషయం తెలుసుకున్న కొమరం భీమ్ ఆ పిల్లను రక్షించే క్రమంలో తనని పట్టుకోవాల్సిన భాధ్యతని సీతారామరాజు కి అప్పగించడం జరుగుతుంది, కానీ ఇద్దరూ స్నేహితులు అవుతారు….

తర్వాత అనుకోని సంఘటనల వలన ఇద్దరూ గొడవ పడాల్సి వస్తుంది, ఇక ఈ ఇద్దరూ తిరిగి ఎలా కలిశారు, బ్రిటీష్ వాళ్ళ పై ఎలా పోరాడారు అన్నది అసలు సిసలు కథ, ఈ కథ ఆలియా భట్, అజయ్ దేవగన్ లు ఎలా హెల్ప్ అయ్యారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

రాజమౌళి సినిమాలలో కథ కన్నా కూడా కథని చెప్పిన విధానం ఎప్పుడూ బాగుంటుంది, ఇక్కడ కూడా అదే జరిగింది, అనుకున్న కథ మాములుగానే ఉంటుంది, కానీ ఆ కథని ఆడియన్స్ కి నచ్చేలా చెప్పే విధానం, ఎక్కడ హై మూమెంట్స్ పడాలి, ఎక్కడ సినిమా స్లో అవ్వాలి, మళ్ళీ ఎక్కడ హై పాయింట్స్ రావాలి, ఎక్కడ ఎమోషనల్ సన్నివేశాలు పడాలి… ఇలా అన్నింటిని పెర్ఫెక్ట్ గా…

RRR Movie Releasing 10000+ Theaters World Wide

లెక్కలు వేసుకుని జక్కన్న సినిమాని చెక్కే విధానం ఆయన బిగ్గెస్ట్ సక్సెస్ ఫార్ములా… ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది… ఇద్దరు హీరోల నుండి ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఎలాంటి హై ఇంట్రో ని ఊహించుకుంటారో అలాంటి ఇంట్రో ఇచ్చి ఇద్దరి స్నేహాన్ని ఆకట్టుకునే విధంగా సాంగ్ లో ప్రజెంట్ చేసి… కథని మెల్లిమెల్లిగా ముందుకు నడుపుతూ….

మళ్ళీ ఓ హై మూమెంట్ ఉండాలి కాబట్టి నాటు నాటు సాంగ్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయేలా ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ తో ఊరమాస్ స్టెప్స్ వేయించి మెప్పించి తర్వాత కొన్ని ఎలివేట్ సీన్స్ ని ఎన్టీఆర్ కి కొన్ని ఎలివేట్ సీన్స్ రామ్ చరణ్ కి బాలెన్స్ చేస్తూ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు… ఫస్టాఫ్ వరకు ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ అనిపించింది(పడ్డ సీన్స్ అలాంటివి)…

కానీ రామ్ చరణ్ పాత్ర కి ఫస్ట్ నుండి ఓ బ్యాగ్ డ్రాప్ స్టొరీ ని పెట్టి దాన్ని బిల్డ్ చేస్తూ సెకెండ్ ఆఫ్ లో ఫెంటాస్టిక్ ట్రాన్స్ ఫార్మేషన్ సీన్ తో ఊహకందని రేంజ్ లో ఎలివేట్ చేశాడు…. ఇక ఇద్దరి పోరాటాలు, యాక్టింగ్ లు సూపర్బ్ గా ఉన్నాయి అని చెప్పాలి. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా డిఫెరెంట్ గా ప్లాన్ చేశాడు జక్కన్న… అది ఏ రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో చూడాలి…

ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ పరంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరూ ఆదరగోట్టేశారు, హీరోయిజం సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఇద్దరివీ కూడా చాలా బాగా ఆకట్టుకోగా ఫస్టాఫ్ ఎన్టీఆర్ హైలెట్ అయితే సెకెండ్ ఆఫ్ లో రామ్ చరణ్ హైలెట్ అవుతాడు అని చెప్పాలి… ఇక ఆలియా భట్ రోల్ చిన్నదే అయినా ఇంపాక్ట్ బాగుంది..ఒలివియా రోల్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది… అజయ్ దేవగన్ శ్రియలు ఫ్లాష్ బ్యాక్ లో పర్వాలేదు అనిపించుకోగా…. సముద్రఖని ఇతర తారాగణంకి పెద్దగా స్కోప్ లేదు కానీ పర్వాలేదు…

సంగీతం రాజమౌళి ఇతర మూవీస్ తో పోల్చితే ఈ సినిమా వీక్ గా ఉంది అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. కానీ విజువల్స్ పరంగా జక్కన్న బాలెన్స్ చేసి ఆ సాంగ్స్ ని స్కిప్ చేయకుండా తన మ్యాజిక్ చూపించాడు, కానీ కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో మాత్రం ప్రీవియస్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని బ్యాగ్రౌండ్ స్కోర్ తో రెచ్చిపోయాడు…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ ఫెంటాస్టిక్ గా ఉన్నప్పటికీ సెకెండ్ ఆఫ్ లో కొంచం ఎక్కువ స్లో అయినట్లు అనిపించింది, సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి కానీ కొన్ని గ్రాఫిక్స్ షాట్స్ నాసికరంగా అనిపించాయి…. ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ హైలెట్స్ విషయానికి వస్తే…

ఇద్దరు హీరోల ఇంట్రోలు, నాటు నాటు సాంగ్, ఇద్దరు హీరోల ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్, గూస్ బంప్స్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్… ఇలా చాలానే హైలెట్స్ ఉన్నాయి సినిమాలో…. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం, లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించడం లాంటివి చిన్న మైనస్ పాయింట్స్ అని చెప్పాలి…

మొత్తం మీద సినిమా అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం కచ్చితంగా అంచనాలను అందుకోవడం కాదు కొన్ని సీన్స్ వరకు అయితే అంచనాలను మించిపోతుంది అని చెప్పాలి. మొత్తం మీద భారీ ఎక్స్ పెర్టేషన్స్ తో థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ఆ ఎక్స్ పెర్టేషన్స్ కి ఏమాత్రం సినిమా తీసిపోలేదు అన్న ఫీలింగ్ తో థియేటర్ బయటికి రావడం ఖాయం… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 3.5 స్టార్స్…

RRR Movie Releasing 10000+ Theaters World Wide

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here