ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డుల వేట మొదలు పెట్టేసింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అక్టోబర్ లో దసరా కానుకగా భారీ లెవల్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సెన్సేషనల్ మూవీ కి గాను ఇప్పటికే రిలీజ్ అయిన ఇద్దరు హీరోల ఇంట్రో టీసర్ లు అల్టిమేట్ రికార్డులను సొంతం చేసుకుని సినిమా పై ఉన్న అంచనాలు…
ఎలాంటివో నిరూపించాయి… ఇక అఫీషియల్ టీసర్ ట్రైలర్ లు రావాల్సి ఉండగానే సినిమా పై క్రేజ్ మరింతగా పెరిగి పోయింది. రీసెంట్ గా సినిమా తమిళనాడు ఏరియా కి గాను బిజినెస్ క్లోజ్ అయింది, తమిళ్ లో సినిమా బిజినెస్ తెలుగు సినిమాల పరంగా ఆల్ టైం రికార్డ్…
బిజినెస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. ఈ సినిమా తమిళ్ లో అన్ని భాషల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఏకంగా 42 కోట్ల భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు. ఇది వరకు బాహుబలి 2 సినిమా కి అక్కడ 37 కోట్ల రేటు దక్కింది. దాంతో ఇప్పుడు…
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ను అక్కడ సొంతం చేసుకుంది. ఇక బాహుబలి 2 సినిమా కి ఎంటైర్ తమిళ రైట్స్ కింద 47 కోట్ల రేటు పలికింది. అంటే అందులో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రెండు బిజినెస్ లు కలిపి సొంతం అయ్యాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కేవలం థియేట్రికల్ బిజినెస్ 42 కోట్ల రేటు తో దుమ్ము దుమారం చేసింది. ఇక కంప్లీట్ రైట్స్ ఎంత బిజినెస్ చేస్తాయో…
తెలియాల్సి ఉండగా సినిమా ఇప్పటి నుండే ఇలాంటి రికార్డులను నమోదు చేస్తే టీసర్ ట్రైలర్ లు రిలీజ్ అయ్యాక రచ్చ మరో రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తీ చేసుకోబోతుంది. ఇక మిగిలిన ఏరియాల్లో ఎలాంటి బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.