బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ప్రీవియస్ రికార్డుల బెండు తీసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం న్యూ రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. కానీ ఇదే టైం లో ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని భావించగా సినిమా కి తెలుగు తర్వాత…
బిగ్ మార్కెట్ అయిన కర్ణాటకలో భారీ రిలీజ్ ముందు అనుకున్నా కానీ పునీత్ రాజ్ కుమార్ గారి చివరి సినిమా జేమ్స్ రిలీజ్ అయ్యి వారం అవ్వడంతో ఆ సినిమాను తీసేసి ఆర్ ఆర్ ఆర్ ను వేస్తున్నారు అని తెలిసి గొడవలు జరగడం వలన ఆర్ ఆర్ ఆర్ కి అనుకున్న రేంజ్ లో…
థియేటర్స్ దక్కలేదు, తర్వాత షోలు కూడా తక్కువ చేశారు, అయినా కానీ ఇవన్నీ తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో కర్ణాటకలో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
అక్కడ సాహో సినిమా 16.15 కోట్ల షేర్ ని అందుకోగా, తర్వాత సైరా నరసింహా రెడ్డి 16.50 కోట్ల షేర్ ని అందుకుంది, మూడో ప్లేస్ లో 10 రోజుల కలెక్షన్స్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ 37.15 కోట్ల షేర్ ని అందుకోగా, రెండో ప్లేస్ లో బాహుబలి 1 38 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది, టాప్ ప్లేస్ లో బాహుబలి 2 52 కోట్ల షేర్ తో నంబర్ 1 గా ఉండగా…
ఇప్పుడు 11వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆర్ ఆర్ ఆర్ మూవీ బాహుబలి రికార్డ్ ను ఆల్ మోస్ట్ అందుకోగా 12 వ రోజు కలెక్షన్స్ తో బాహుబలి1 ని బ్రేక్ చేసి అక్కడ ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకోబోతుంది…. ఇక లాంగ్ రన్ లో బాహుబలి 2 కి ఎంత చేరువగా వెళుతుంది అన్నది ఆసక్తిగా మారగా పరిస్థితులు ఫస్ట్ డే నుండి అనుకూలంగా ఉంటే సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని సాధించి ఉండేది అని అంటున్నారు…