Home న్యూస్ RRR అఫీషియల్ న్యూ రిలీజ్ డేట్…మాస్ భీభత్సం పక్కా!!

RRR అఫీషియల్ న్యూ రిలీజ్ డేట్…మాస్ భీభత్సం పక్కా!!

830
0

ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఇప్పటికే మూడు సార్లు సినిమా రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేయగా మూడు సార్లు అనుకోని అవరోధాల కారణంగా సినిమా రిలీజ్ ఆగిపోయింది.

అక్టోబర్ 13 మిస్ అయితే 2022 సమ్మర్ కే సినిమా ను రిలీజ్ చేస్తామని సంక్రాంతికి రామని క్లియర్ గా చెప్పడంతో వరుస పెట్టి సంక్రాంతికి సినిమాలను అనౌన్స్ చేశారు కానీ ఆర్ ఆర్ ఆర్ ని అత్యంత భారీ రేట్లకి కొనడంతో బయ్యర్లు ఆ నిర్ణయానికి ఇప్పుడు ససేమీరా నో చెప్పడంతో చేసేదేమీ లేక…

ఆల్ రెడీ సంక్రాంతికి సినిమాల రిలీజ్ లు అనౌన్స్ చేసినా ఇప్పుడు జనవరి 7 న సినిమాను రిలీజ్ చేయబోతున్నాం అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సంక్రాంతికి వారం ముందు నుండే బాక్స్ ఆఫీస్ భీభత్సం ఖాయం అవ్వగా సంక్రాంతి సినిమాలు కూడా దారి వదిలితే ఇక ఆర్ ఆర్ ఆర్ చరిత్ర తిరగరాసే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడానికి ఛాన్స్ ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here