బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు చరిత్ర లో నిలిచిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో రోజు కి వచ్చే సరికి ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ ని దక్కించుకుంది, సినిమా కి టికెట్ హైక్స్ మరీ ఎక్కువ గా ఉండటం వలన కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఓవరాల్ కలెక్షన్స్ మాత్రం సెన్సేషనల్ అనిపించేలా సొంతం చేసుకుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా ఒక్క నైజాం ఏరియా లోనే సాధించిన డే 2 కలెక్షన్స్ కొత్త రికార్డు ను నమోదు చేసింది అని చెప్పాలి.
ఆర్ ఆర్ ఆర్ మూవీ పక్కకు పెడితే ఇప్పుడు ఏ సినిమా కూడా మొదటి రోజే 12 కోట్ల మార్క్ ని అందుకోలేదు, కానీ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 2 వ రోజు కి వచ్చే సరికి నైజాం ఏరియా లో ఏకంగా 15 కోట్లకి పైగా షేర్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టింది…
బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సినిమా నైజాం ఏరియాలో చరిత్ర లో నిలిచి పోయే రేంజ్ లో 15.10 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ కొట్టగా ఓవరాల్ గా నైజాం లో రెండో రోజు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
👉#RRRMovie – 15.10CR
👉#BheemlaNayak – 7.48Cr
👉#Pushpa – 7.40Cr
👉#RadheShyam – 6.61Cr
👉#Saaho – 5.21Cr
👉#Baahubali2 – 4.84Cr
ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఊచకోత కోసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఓవరాల్ గా బిగ్గెస్ట్ బెంచ్ మార్క్స్ ని అప్ కమింగ్ మూవీస్ కి సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా లాంగ్ రన్ లో నైజాం ఏరియాలో సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కొత్త రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి ఇక.