Home గాసిప్స్ బ్రేకింగ్ న్యూస్ RRR ఔట్..రజినీ ఇన్…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!!

బ్రేకింగ్ న్యూస్ RRR ఔట్..రజినీ ఇన్…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!!

1429
0

పరిస్థితులు మొత్తం మారిపోయాయి, ఏడాది ఆరంభం అద్బుతంగా ఉన్నా ఫస్ట్ క్వార్టర్ ముగియకుండానే ఎదురు దెబ్బలు తగలడం మొదలు అయింది, కరోనా ఎఫెక్ట్ ప్రతీ ఒక్కరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుండగా అది ఇండస్ట్రీ కి కూడా షాక్ ఇస్తూనే ఉంది, రిలీజ్ లో ఆగిపోయిన సినిమా లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక ఈ ఎఫెక్ట్ వచ్చే ఇయర్ రిలీజ్ అయ్యే సినిమా ల పై కూడా సాలిడ్ గా పడింది.

ఈ ఏడాది రావాల్సిన ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఇయర్ సంక్రాంతి కి పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో అఫీషియల్ గా సంక్రాంతి రేసు నుండి ఈ సినిమా తప్పుకుంది. ఈ విషయాన్ని నిర్మాత డి వి వి దానయ్య అఫీషియల్ గా తెలియజేశారు.

సంక్రాంతి కి సినిమా రావడం అసాధ్యం అని, కొత్త డేట్ పరిశీలన లో ఉన్నామని తెలియజేశాడు. ఈ విషయం ముందే తెలిసిందే ఏమో, సూపర్ స్టార్ రజినీకాంత్ శివ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అన్నాటల్లె సంక్రాంతి రేసు లో నిలుస్తుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ కూడా కన్ఫాం చేశారు నిర్మాత దానయ్య.. ఎన్టీఆర్ బర్త్ డే కోసం స్పెషల్ గిఫ్ట్ ని సిద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం ఆ పని లోనే రాజమౌళి ఉన్నారని తెలియజేశారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే కి లుక్ తో పాటు టీసర్ కూడా రిలీజ్ అవ్వడం కన్ఫాం అయింది.

Young Tiger NTR Fans Created All Time RECORD CDP Trend

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడమే సమంజసం అని విశ్లేషకులు భావిస్తున్నారు, ఆర్ ఆర్ ఆర్ కి సీజన్ తో పనిలేదు, కానీ అదే సమయం లో జనాలను భారీ సంఖ్యలో థియేటర్స్ కి రప్పించే సంక్రాంతి కి ఎక్కువ సినిమాలు ఉంటే అంత బెనిఫిట్ అని అంటున్నారు. ఇక త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ న్యూ రిలీజ్ డేట్ తెలియనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here