ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో భారీ హైప్ తో వచ్చిన సినిమా, పెట్టిన బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో ఆ బడ్జెట్ లో ఎక్కువ మొత్తం రికవరీ అవ్వాలి అంటే ఎక్కువ కలెక్షన్స్ కావాలి, అందుకే ప్రస్తుతం పెద్ద సినిమాలకు ఇచ్చే రేట్స్ కన్నా కూడా ఆర్ ఆర్ ఆర్ కి భారీ రేట్లు ఇచ్చారు, తెలంగాణలో 413 వరకు రేటు, ఆంధ్ర ప్రదేశ్ 380 వరకు రేట్స్ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు…
ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్ వీకెండ్ వరకు రేట్స్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా సినిమాను చూశారు, దాంతో వీకెండ్ రికార్డ్ బ్రేకింగ్ ఫుల్స్ అండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి నైజాంలో 354 రేటు అలాగే ఆంధ్రలో 300 వరకు రేటు పెట్టారు, కానీ…
వర్కింగ్ డేస్ లో ఎక్కువగా సినిమాలు చూసేది కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్…. ఈ రేట్స్ చూసి మల్టీప్లేక్సులకు చాలా తక్కువగా వెళుతున్న జనాలు సింగిల్ స్క్రీన్స్ లో ఎక్కువగా చూస్తున్నారు… దాంతో ఆ ఇంపాక్ట్ ఓవరాల్ ఆక్యుపెన్సీ పై పడి ఆక్యుపెన్సీ తగ్గినా రేటు ఇప్పటికీ నార్మల్ మూవీస్ కన్నా కూడా…
ఎక్కువగా ఉండటంతో ప్రతీ రోజూ రికార్డులు వస్తున్నాయి… ఒకసారి తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రోజు నుండి 6వ రోజు వరకు సినిమా డ్రాప్స్ ను గమనిస్తే…
👉Day 1 – 74.11Cr
👉Day 2 – 31.63Cr(67%~ Drop)
👉Day 3 – 33.53Cr(12%~ Growth)
👉Day 4 – 17.73Cr(47%~ Drop)
👉Day 5 – 13.63Cr(23%~ Drop)
👉Day 6 – 9.54Cr(30%~ Drop)
ఇక వరల్డ్ వైడ్ డ్రాప్స్ ను గమనిస్తే…
👉Day 1 – 135Cr
👉Day 2 – 67.44Cr(50%~ Drop)
👉Day 3 – 78.73Cr(16.8%~ Growth)
👉Day 4 – 35.88Cr(55%~ Drop)
👉Day 5 – 31.13Cr(13%+ Drop)
👉Day 6 – 23.19Cr(25.6%~ Drop)
వీక్ డేస్ లో డ్రాప్స్ కామన్ కానీ ఈ సినిమా టార్గెట్ పెద్దది అవ్వడంతో 6వ రోజు డ్రాప్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. ఒకవేళ టికెట్ రేట్స్ తగ్గించి ఉంటే ఎక్కువ జనాలు థియేటర్స్ లో సినిమా ని చూసే వాళ్ళు, ఓవరాల్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేవి, కానీ సినిమా టికెట్ రేట్స్ ని రెండో వీకెండ్ అయ్యే వరకు తగ్గించే అవకాశం లేదు…. ఫ్యాన్స్ కూడా రిపీట్స్ లో సినిమాను చూడనివ్వకుండా ఈ రేట్స్ ఇంపాక్ట్ చూపుతున్నాయి…. మరి ఆర్ ఆర్ ఆర్ టీం ఈ రేట్స్ ని తగ్గిస్తారో లేదో చూడాలి.